తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు ప్రయాణాల్లో ఆటంకాలు- జాగ్రత్తగా ఉండటమే మంచిది! - DAILY HOROSCOPE

2025 జనవరి​ 25వ తేదీ (శనివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 4:51 AM IST

Horoscope Today January 25th 2025 : 2025 జనవరి​ 25వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఓ కీలక విషయంలో విజయం సాధిస్తారు. ఓ సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. గర్వాతిశయాలకు లోను కాకుండా ఉండాలి. ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచన ఉంది. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతితో ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచన ఉంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా సమస్యలతో విచారంగా ఉంటారు. సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంతో ముందడుగు వేసే సత్ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వృధా ఖర్చులు నివారించాలి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా శుభవార్తలు వింటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారంలో ఆచి తూచి అడుగేయాలి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహనా లోపం లేకుండా జాగ్రత్తగా పడాలి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పోటీ, సవాళ్లు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలుండవచ్చు. నూతన గృహవాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సత్సాంగత్యం మేలు చేస్తుంది. ధర్మాన్ని విడిచి పెట్టవద్దు. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు గడిస్తారు. మొండి వైఖరి వీడితే మంచిది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల పనులు ఆలస్యం కావచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరగవచ్చు. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పనిభారం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు ఎదురవుతాయి. కీలక విషయాల్లో చేసే చర్చలు ఫలించవు. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. అభయ అంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్ఠలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. కీలక విషయంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయంగా ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సునాయాసంగా సకాలంలో పూర్తవుతాయి. పని ప్రదేశంలో, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు, వృత్తినిపుణులు ఊహించని శుభ ఫలితాలు అందుకుంటారు. పొత్తులు, భాగస్వామ్యాలు అదృష్టకరంగా ఉంటాయి. ఊహించని విజయం సాధిస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆలస్యం అయినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కావు. సన్నిహితులతో విభేదాలకు అవకాశం ఇవ్వకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శని స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details