తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు అన్నీ శుభాలే- కానీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది - DAILY HOROSCOPE IN TELUGU

2025 జనవరి​ 23వ తేదీ (గురువారం) రాశిఫలాలు

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 2:11 AM IST

Horoscope Today January 23rd 2025 : 2025 జనవరి​ 23వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉండడంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్ మెంట్స్ చేపడతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. అవసరానికి ధనం సమకూరుతుంది. తల్లిదండ్రుల నుంచి శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని అవమానకార సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. ఈ రోజు ముఖ్యమైన పనులు చేపట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సంతానం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా ఈ రోజు అనుకూలం కాదు. కుటుంబ సభ్యులతో కలహాలు విచారం కలిగిస్తాయి. ఆర్ధిక నష్టాలు సంభవించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం కారణంగా ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కొంతమంది ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పోటీ దారులపై విజయం సాధిస్తారు. భాగస్వాములతో అభిప్రాయం భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. సన్నిహితులతో సంబంధాలు బాగుంటాయి. ప్రియమైన వారితో, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభకరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. శుభసమయం నడుస్తోంది. వృత్తి వ్యాపారాలలో లాభాలున్నాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ ప్రతిభతో విజయాలు అందుకుంటారు. సంపద పెరుగుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. మిత్రుల సహకారం ఉంటుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ ఆత్మ విశ్వాసంతో అధిగమిస్తారు. ఫైనాన్స్, కమిషన్ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. గిట్టని వారు చేసే విమర్శలు పట్టించుకోవద్దు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల నిర్ణయాలు ఉండవచ్చు. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోపావేశాలు తగ్గించుకుంటే మంచిది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంట్లో బంధువుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. లక్ష్య సాధనలో శ్రమ పెరుగుతుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. డబ్బు అనవసరంగా ఖర్చవుతుంది. ఒక వార్త మనస్తాపం కలిగిస్తుంది. బంధువులతో వైరం ఏర్పడవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో, బంధువులతో అకారణ కలహం చికాకు కలిగిస్తుంది. మిత్రులలో కొందరి ప్రవర్తన బాధిస్తుంది. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది. ఆర్థికవృద్ధి ఉంటుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అనైతికమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నవగ్రహ స్తోత్రం పఠించడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details