తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి అన్ని ప్రతికూల ఫలితాలే- తొందరపాటు నిర్ణయాలు వద్దు! - DAILY HOROSCOPE IN TELUGU

2025 ఫిబ్రవరి 18వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2025, 5:00 AM IST

Horoscope Today February 18th 2025 : 2025 ఫిబ్రవరి 18వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహంలో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్ట దేవతారాధన శ్రేష్టం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలుంటాయి. మానసిక ఆనందం కలిగే సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మీ ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి. సన్నిహితులతో ఆహ్లాదంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడుదొడుకులు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, అవరోధాలతో సతమతమవుతారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో కుటుంబసభ్యులతో గొడవపడతారు. ధననష్టం సంభవించే పరిస్థితి ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కీలకమైన సమావేశాలలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఓ కీలకమైన ప్రాజెక్టులో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనుకోని అదృష్టం మీ ఆనందానికి కారణమవుతుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు కళ, సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. పనిలో మీ నైపుణ్యం మంచి గుర్తింపు తెస్తుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు రాబట్టడానికి అనువైన సమయం నడుస్తోంది. మీ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వెచ్చిస్తే ఉన్నతస్థితికి చేరుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల సంతృప్తిని కలిగిస్తుంది. విందువినోదాలలో పాల్గొంటారు. ఓ వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇష్ట దేవత ఆలయ సందర్శన ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ప్రమాదకరమైన ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇతరుల ఒత్తిడితో కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. మొహమాటాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేష్టం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. సమయానికి పనులు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఆర్ధిక పరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. గిట్టని వారి విమర్శలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ప్రార్ధనతో శుభ ఫలితాలుంటాయి.

ABOUT THE AUTHOR

...view details