తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు శత్రువులతో జాగ్రత్త- అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా కూడా! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 14th 2024 : ఆగస్టు​ 14న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 3:40 AM IST

Horoscope Today August 14th 2024 :ఆగస్టు​ 14న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ముఖ్య వ్యవహారాల్లో ఆచి తూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలున్నా అధిగమిస్తారు. ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వీలైతే ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కొత్త ప్రాజెక్టులు ఈ రోజు మొదలుపెట్టకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంతో పరిష్కరిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఒక కీలకమైన వ్యహారంలో సమయస్ఫూర్తితో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. స్నేహితులతోనూ, కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. దూరదేశాల నుంచి అందిన శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో మంచి పేరు పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. గృహంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో అదనపు పెట్టుబడులు సమకూరుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అందరి సహకారం లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనితీరుకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. శారీరకంగానూ , మానసికంగానూ ఆరోగ్యంగానే ఉంటారు. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు. అనారోగ్యం కారణంగా మానసికంగా అస్థిరతతో ఉంటారు. ఏ పనిమీద దృష్టి సారించలేకపోతారు. వ్యాపారంలో నష్టాలు మానసిక ఆందోళనకు కారణమవుతాయి. సహనంతో ఉంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకొని సర్దుబాటు ధోరణితో ఉంటే సమస్యలు తగ్గుతాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మేలు జరుగుతుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేసే ప్రతీ అడుగు పరిశీలించుకోవాలి. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. కోపాన్ని తగ్గించుకొని, ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. పని మీద ఏకాగ్రత, చిత్తశుద్ధితో ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్తగా ప్రారంభించే పనులు ఈ రోజు వాయిదా వేస్తే మంచిది. శ్రీ ఆంజనేయస్వామి ప్రార్ధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి నిరాశాజనకంగా ఉంటుంది. ఆర్ధికంగా మోసపోయే ప్రమాదముంది. మోసపూరిత వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆర్ధిక నష్టం సూచితం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడంలో సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాల కారణంగా మంచి లాభాలను అందుకుంటారు. స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండక పోవచ్చు. వృత్తి పరంగా ముఖ్యులతో సరిగా మాట్లాడే తీరూ, సమర్థతా లేకపోవడంతో మీరు చాలా ఇబ్బందిలో పడే అవకాశముంది. అనుభవజ్ఞుల సలహాలు తప్పకుండా తీసుకోవాలి. ఉద్యోగులకు గడ్డుకాలం. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. పై అధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శివారాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు మంచి లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొని డబ్బు పోగొట్టుకుంటారు. అయితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగల మీ సామర్ద్యం ఈ రోజు మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గిట్టనివారు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పోటీ విపరీతంగా పెరుగుతుంది. ఆర్ధికంగా నష్టపోవచ్చు. మీకన్నా బలవంతులతో పోరు తగదు. పోటీ దారులతోనూ, ప్రత్యర్థులతోనూ అనవసరమైన తగాదాలు రాకుండా చూసుకోండి. కుటుంబ కలహాల కారణంగా తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతారు. పాజిటివ్ ధింకింగ్, మనోబలంతో పనిచేస్తే విజయం మీదే! అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వినాయకుని ఆలయ సందర్శన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details