తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్​! శివారాధన శ్రేయస్కరం! - Horoscope Today August 11th 2024 - HOROSCOPE TODAY AUGUST 11TH 2024

Horoscope Today August 11th 2024 : ఆగస్టు​ 11న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today August 11th 2024
Horoscope Today August 11th 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 5:05 AM IST

Horoscope Today August 11th 2024 :ఆగస్టు​ 11న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో చక్కని పురోగతి ఉంటుంది. మానసికంగా సంతోషంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గతంలో చేజారిన ప్రాజెక్టులను తిరిగి పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణమవుతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన సమయం. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ రోజంతా స్నేహితులతో, బంధువులతో సరదాగా గడిచిపోతుంది. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కొత్త అసైన్మెంట్స్​పై సంతకాలు చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి శుభవార్త అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అందరిని కలుపుకొని పోవడం మంచిది. సమష్టి నిర్ణయాలతో విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు చేటు తెస్తాయి. ఉద్యోగంలో సవాళ్లు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్స్ ప్రారంభించడానికి ఈ రోజు శుభకరమైన రోజు కాదు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా మానసికంగా ఆందోళనకు గురవుతారు. ఉద్యోగంలో గత తప్పిదాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. అదుపులేని కోపం కారణంగా కుటుంబసభ్యులతో గొడవపడతారు. వ్యాపారంలో ధననష్టం సూచితం. దైవబలం మీద విశ్వాసంతో, భవిష్యత్ మీద సానుకూల ఆలోచనతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కొత్తగా ఏర్పరుచుకున్న సంబంధాలు, పొత్తులతో లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తారాబలం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. పోటీదారుల ఎత్తులను తిప్పికొట్టి మీరంటే ఏమిటో నిరూపించుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి పట్ల కఠినం ఉంటే మంచిది. ఆర్థికంగా శుభసమయం. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిక్కచ్చిగా వ్యవహరించడం కొందరికి నచ్చక పోవచ్చు. మీ వైఖరిని విమర్శించే వాళ్ల గురించి పట్టించుకోవద్దు. వ్యాపారంలో నిధుల కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు మంచి జీతంలో ఉద్యోగప్రాప్తి ఉంది. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని మీ బలహీనత కారణంగా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. పరుషమైన మీ మాట తీరు, కోపం నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సాధారణ అనారోగ్యం, బద్ధకం, ఒత్తిడి కారణంగా అన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. వ్యాపారులు వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో పెరుగుతున్న పోటీ, ఎదురవుతున్న సవాళ్లు మిమ్మల్ని ఈరోజు ప్రశాంతంగా ఉండనివ్వవు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి సంపద, సంతోషం సమృద్ధిగా లభిస్తాయి. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో అధికలాభాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నతంగా ఆలోచించి నలుగురికి ఆదర్శంగా ఉంటారు. గణపతి ప్రార్థన శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారస్తులు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అయితే ఈ ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం మీకు చాలా భారంగా మారుతుంది. సంతానానికి సంబంధిన సమస్యల కారణంగా ప్రశాంతత కోల్పోతారు. కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. స్థానచలనం సూచన ఉంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార రంగాల వారు ఈ రోజు వ్యవహరించే అన్నీ పనుల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సంయమనం పాటించండి. వీలైతే వాయిదా వేయండి. ఉద్యోగంలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details