తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి వ్యాపారంలో లాభాలు!- అధిక ఖర్చులున్నాయి జాగ్రత్త! - Horoscope Today April 7th 2024 - HOROSCOPE TODAY APRIL 7TH 2024

Horoscope Today April 7th 2024 : ఏప్రిల్​ 7న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 5:12 AM IST

Horoscope Today April 7th 2024 :ఏప్రిల్​ 7న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్ధికంగా లాభపడతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వృత్తివ్యాపారాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారికి జీవితంలో నూతన శకం ప్రారంభం కానుంది. ఎటు చూసినా కలిసివచ్చే కాలంగానే కనిపిస్తోంది. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అద్బుతమైన రోజు. వ్యాపారులు మంచి విజయాలను అందుకుంటారు. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే కార్య కలాపాలకు దూరంగా ఉంటే మేలు. ఇతరుల మనసు గాయపరిచేలా మాట్లాడవద్దు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారపరంగా కీలక ఒప్పందాలు చేసుకుంటారు. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. శివాష్టకం పఠిస్తే మేలు.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఈ రోజు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసివస్తుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పఠించండి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. కొన్ని రకాల చర్చల్లో, వాదనల్లో చురుగ్గా పాల్గొని మీ సత్తా ఏమిటో అందరికీ చూపిస్తారు. రచనా వ్యాసంగాన్ని అనువైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి. శ్రీ దుర్గా స్తుతి పారాయణ చేస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పట్టుదలకు పోవద్దు. భావోద్వేగాలతో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే తరువాత చింతిచాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మి దేవి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజు ప్రారంభంలో బాగానే ఉన్నట్లు అనిపించినా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంట్లో గొడవల కారణంగా అశాంతికి లోనవుతారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. శనిస్తోత్రం పఠించండి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. గొడవలు రాకుండా ఉండాలంటే మౌనాన్ని ఆశ్రయించడమే మేలు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేయడం ఉత్తమం. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివాలయ సందర్శన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు చాలా విశేషమైనది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గమ్యాన్ని చేరుకుంటారు. వృత్తివ్యాపారాల్లో అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కోరుకున్న ఫలితాలను పొందటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ధ్యానం , యోగా సాధన చేయడం మేలు. సన్నిహితులతో వివాదాలకు అవకాశముంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. శుభఫలితాలు కోసం శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవండి.

ABOUT THE AUTHOR

...view details