తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈరోజు వాహనయోగం- విద్యార్థులు విజయం సాధిస్తారు! - Horoscope Today April 1st 2024 - HOROSCOPE TODAY APRIL 1ST 2024

Horoscope Today April 1st 2024 : ఏప్రిల్​ 1న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 1st 2024
Horoscope Today April 1st 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 5:09 AM IST

Horoscope Today April 1st 2024 :ఏప్రిల్​ 1న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. శుభకార్యాల్లో కొన్ని అనుకోని సంఘటనల వలన మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్యం సహకరించదు. మొండితనం వీడి సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. యోగా, ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లోపిస్తుంది. ఆరోగ్యం సహకరించదు. ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత పొందుతారు. ప్రయాణాలు అనుకూలించవు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు సరైన సమయం కాదు. శివారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వాహనయోగం ఉంది. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్టయోగం ఉంది. తలపెట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులకు కలిసివచ్చే రోజు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. దుర్గా ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. బద్ధకంతో వ్యవహరిస్తారు. పనుల్లో ఆలస్యం చికాకు తెప్పిస్తుంది. సన్నిహితులతో కలహాలు మనస్థాపానికి గురిచేస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తుల రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. విహారయాత్రలకు వెళ్తారు. దైవచింతన కలిగి ఉంటే మేలు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శత్రుజయం ఉంటుంది. అన్నింటా విజయం సాధిస్తారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. నిరాశావాదం వీడండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. తీర్థయాత్రలకు వెళ్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శుభకార్య సంబంధ చర్చలు జరుగుతాయి. వినాయకుని ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజు. వృత్తివ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపారస్థుల ప్రయత్నాలు విజయానికి దారి తీస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వ్యాపారులు విపరీతమైన లాభాలు పొందుతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details