తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ రోజు ఆ రాశివారు జాగ్రత్త- ప్రతి పనిలోనూ అవరోధమే! - Horoscope Today April 14th 2024

Horoscope Today April 14th 2024 : ఏప్రిల్​ 14న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 14th 2024
Horoscope Today April 14th 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 5:09 AM IST

Horoscope Today April 14th 2024 : ఏప్రిల్​ 14న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కానీ ఈ రోజు ఒత్తిడి కారణంగా మీకు మానసిక ప్రశాంతత ఉండదు. అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. అధికారిక ప్రయాణ సూచన ఉంది. సాయంత్రానికి పరిస్థితులు చక్కబడటం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయి. శ్రీలక్ష్మి ధ్యానం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వీలైనంతవరకు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటే ప్రయోజనం ఉంటుంది. గందరగోళం, అయోమయం కారణంగా చేతికందిన అవకాశాలు చేజారిపోతాయి. ఓర్పుతో సంయమనం పాటిస్తే పరిస్థితులు చక్కబడతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. నవగ్రహ ధ్యానం అనుకూల ఫలితాలను ఇస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్ధికంగా విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర లాభం. బంధుమిత్రులతో కులాసాగా గడుపుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వృధా ఖర్చులు ఉండే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఈ రోజంతా తీరిక లేకుండా ఉంటారు. పని ఒత్తిడి కారణంగా గందర గోళానికి గురవుతారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబసభ్యులతో వాదోపవాదాలు, ఘర్షణలు ఉంటాయి. గృహంలో శాంతి లోపిస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మాటలు అదుపులో పెట్టుకోండి. వివాదాలకు పోవద్దు. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. విహారయాత్రకు వెళతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్యం బాగుటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు ఎంతో బాగుంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. ఈ రోజు ఏ పని ప్రారంభించిన విజయం మీ వెంటే ఉంటుంది. చేసే వృత్తిలో అభివృద్ధి, పదోన్నతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. గృహంలో శాంతి నెలకొంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి నిపుణులకు, వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. పనినుంచి విశ్రాంతి తీసుకొని విహారయాత్రకు వెళతారు. సాహిత్యపరమైన చర్చలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. సూర్య ఆరాధన మంచిది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. పని ఒత్తిడి పెరుగుతుంది. అలసటతో ఉంటారు. విశ్రాంతి అవసరం. అనుకున్న పనులు సమయానికి పూర్తికావు. అందువల్ల కొత్త పనులు, కార్యక్రమాలను వాయిదా వేయాలి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. యోగా, ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత కోసం ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. రోజంతా చురుకుగా, ఉల్లాసభరితంగా ఉంటారు. మీరు విదేశీయుల సాంగత్యంలో ఆనందిస్తూ ఉంటారు. స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళతారు. ఈరోజు సాహిత్య కార్యకలాపాలకు అనువుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం లక్ష్మీ అష్టోత్తతర స్తోత్రం చదవండి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు చాలా సరదాగా గడిచిపోతుంది. జీవితభాగస్వామితో కలిసి విందువినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. పని ఒత్తిడి నుంచి విరామం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆంజనేయస్వామి ధ్యానంతో ప్రశాంతంగా ఉంటారు.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కొత్త పనులు, ప్రయాణాలు చేపట్టవద్దు. కొన్ని అనుకోని సంఘటన కారణంగా రోజంతా ఆందోళన చెందుతారు. వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా ఉంటేనే మంచిది. మితిమీరిన ఖర్చులు ఉండవచ్చు. సహనంతో ఉండండి. నిదానమే ప్రధానంగా అన్నట్లు ఉంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం. నవగ్రహ ధ్యానంతో అనుకూల ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు ఒక కఠినమైన రోజు. ప్రతి విషయంలో వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆర్ధికంగా నష్ట పోతారు. యోగా, ధ్యానంతో సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఎవరితోను అవసరానికి మించి మాట్లాడవద్దు. మీ మాటలు ఇతరులను బాధించేలా ఉండకూడదు. ఇష్ట దేవతారాధనతో సమస్యల నుంచి బయట పడవచ్చు.

ABOUT THE AUTHOR

...view details