Horoscope Today 6th September 2024 : 2024 సెప్టెంబర్ 6న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఆర్ధిక వ్యవహారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. విఘ్న వినాయకుని పూజించడం శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు నష్టాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు ఈ రోజు కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి మందగిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అనిశ్చితి, సందిగ్ధత నెలకొంటాయి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలతో నష్టం రావచ్చు. స్థిరాస్తులు, వారసత్వపు ఆస్తుల వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం కారణంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాల కారణంగా అశాంతితో ఉంటారు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సహనంతో ఉంటే మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మరికొంతకాలం వేచి చూడాలి. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తిలో పురోగతి సాధించడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆశించిన ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చు. గిట్టని వారు చేసే విమర్శలు పట్టించుకోవద్దు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు అవసరానికి ధనం చేతికి అందుతుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ఆగిపోవడం వల్ల తీవ్ర నిరాశకు లోనవుతారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఏ విషయంలో తొందరపడకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తే మంచిది. దైవబలం మీద విశ్వాసం ఉంచి సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు బుద్ధిబలంతో పని చేసి మంచి విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధనతో మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఓ కీలకమైన వ్యవహారంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీకటాక్షం ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. దైవ దర్శనాలు కోసం తీర్ధ యాత్రలు చేస్తారు. ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విహార యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఖర్చులు పట్ల అదుపు లేకపోతే ఆర్ధిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావచ్చు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. గణనాధుని ఆరాధన శుభకరం.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. కీలకమైన వ్యవరాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం తగ్గవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్ధిక పరిస్థితి దిగజారవచ్చు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు సంభవించవచ్చు. మీకు చెడ్డ పేరు తీసుకువచ్చే ఇబ్బందికర పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడకుండా చూసేందుకు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. మీకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలోఆస్తి తగాదాలు ఏర్పడతాయి. న్యాయ పరమైన వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.