తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే- కానీ ఘర్షణలకు దూరంగా ఉండడం మేలు! - Horoscope Today - HOROSCOPE TODAY

Horoscope Today 6th October 2024 : 2024 అక్టోబర్ 6వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 4:29 PM IST

Horoscope Today 6th October 2024 : 2024 అక్టోబర్ 6వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక సందిగ్ధత నెలకొంటుంది. మీ పరుషమైన మాటలతో సన్నిహితులను నొప్పిస్తారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కొత్త ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు వాయిదా వేయండి. ప్రయాణాలకు ఈ రోజు అనుకూలం కాదు కాబట్టి వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారు ఇంటికి వస్తారు. దీనితో మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివపార్వతుల ఆలయ సందర్శన శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. దీనితో మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. గతంలోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశముంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో అపార్థాలతో దూరం చేసుకున్న వారితో అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి పరంగా శత్రువులతో ఘర్షణ కన్నా శాంతి చర్చలు జరపడమే మంచిది. పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంభిస్తే మేలు. ఖర్చులు అదుపు తప్పే సూచనలున్నాయి. ప్రయాణాలు అనుకూలం కాదు కాబట్టి వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతాన్ని వీడి వర్తమానంపై దృష్టి సారిస్తే మంచిది. అనవసరంగా చిన్న విషయానికి ఆత్రుత చెందే అలవాటు మానుకోండి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని వివాదాలు, అపార్థాలు ఏర్పడే అవకాశముంది. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ప్రభుత్వ, ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా అంతటా విజయమే. వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి వంటి గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వచ్చి ఆదాయం వృద్ది చెందుతుంది. అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలతో సంతోషంగా ఉంటారు. వారసత్వపు ఆస్తులు అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ ధోరణితో ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. మొహమాటానికి పోయి ఎవరిని ఇబ్బంది పెట్టలేక ఇరకాటంలో పడతారు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఆశావహ దృక్పథం, ఆత్మ విశ్వాసం కలిగి ఉండడం ఎంతో అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ వ్యవహారాల పట్ల సర్దుబాటు ధోరణితో ఉంటే కలహాలు ఏర్పడవు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండమైన రోజు. ప్రియమైన వారి సాంగత్యంతో, కుటుంబ సభ్యుల అనురాగంతో రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. మీకు అత్యంత ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పటికినీ దానిని అధిగమిస్తారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సమస్యలు అదుపులో పెట్టడానికి మీ శాయశక్తులా కృషి చేసినా ఫలితం ఉండదు. బంధు మిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నప్పుడు మౌనంగా ఉంటే మేలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. శివాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు ఈ రోజు వేగవంతమవుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం సాగుతుంది. భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగులకు అనుకున్న రీతిలో పనులు సాగుతాయి. సహోద్యోగుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసి పదోన్నతులు పొందుతారు. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ శుభకరం.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు, ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని చూస్తారు. సునాయాసంగా లక్ష్యాలను చేరుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారులు లక్ష్మీకటాక్షంతో సంపదలను వృద్ధి చేసుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో లాభనష్టాలు సరి సమానంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. లేకుంటే అపార్థాలు, అనుమానాలు పెరుగుతాయి. ఘర్షణలకు దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆంజనేయస్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details