తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు ఏ పని చేపట్టినా అడ్డంకులే- ఆరోగ్యం విషయంలో జాగ్రత్త! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today 4th September 2024 : 2024 సెప్టెంబర్ 4న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 3:45 AM IST

Horoscope Today 4th September 2024 : 2024 సెప్టెంబర్ 4న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి కార్యసిద్ధి, విజయప్రాప్తి, లక్ష్మీకటాక్షం ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. ఈ రోజు ఈ రాశి వారిని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీడియా రంగం వారికి అనుకూలంగా ఉంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సదస్సులు, చర్చలలో రాణిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఎటు చూసినా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సహనంతో ఉంటే మేలు. ఆరోగ్యం, చదువుల కోసం అధిక మొత్తంలో ధనవ్యయం ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలున్నా అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకండి. వ్యాపారులు పోటీ దారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంపద పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన వెంచర్లు మొదలు పెట్టడానికి శుభ సమయం. దుర్గారాధన శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మ విశ్వాసంతో పనిచేసి అఖండమైన విజయాన్ని అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ నిర్ణయ శక్తికి, నాయకత్వ లక్షణాలకు మంచి ఫలితాలు వస్తాయి. కఠిన సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరిస్తారు. దైవబలం అండగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. శివారాధన శుభకరం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన భావోద్వేగంతో స్పందిస్తారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం మంచిది. అన్ని రంగాల వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారంలో పోటీదారుల నుంచి కొత్త సవాళ్లు ఎదురు కావచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆర్థికంగా నష్టాలు ఉండవచ్చు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. పదోన్నతులు, స్థానచలనం ఉండవచ్చు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. న్యాయ సంబంధిత అంశాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. హనుమన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆర్థిక ప్రయోజనాలు వంటి శుభఫలితాలతో ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి చేపట్టిన పనులలో అద్భుతాలు చేస్తాయి. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఉద్యోగులు అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుని విజయపధంలో దూసుకెళ్తారు. సంపద పెరుగుతుంది . శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని విషయాలలో ఆచితూచి అడుగు వేస్తే మంచిది.ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. శని శ్లోకాలు పఠిస్తే మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సానుకూల దృక్పధంతో ముందడుగు వేయండి. ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతోనూ పని చేసి,పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కోర్టు వ్యవ్యహారాలు ఎటూ తేలక చికాకు కలిగిస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. వైద్య ఖర్చుల నిమిత్తం ధనవ్యయం ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి పరంగా అభివృద్ధికి సంబంధించి శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వ్యాపారులకు, వృత్తినిపుణులకు ఊహించని ధన లాభాలు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల మాటలకు ఎక్కువ విలువ ఇవ్వొద్దు. మీ సొంత తెలివితేటలతో చేసే పనులే సక్రమంగా ఉంటాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఉత్సాహంగా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details