Horoscope Today 2nd September 2024 : 2024 సెప్టెంబర్ 2న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఉన్నతాధికారుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతుతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం పురోగతి పట్ల సంతృప్తితో ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. స్దాన చలనం సూచన ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. వృత్తి వ్యాపారాలలో సంకట పరిస్థితులు ఎదురవుతాయి. నమ్మిన వారి కారణంగా మోసపోయే ప్రమాదముంది. సన్నిహితుల సహకారంతో ఆపదల నుంచి బయట పడతారు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను పొందుతారు. హనుమాన్ చాలీసా పరాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో చెప్పుకోతగిన మార్పులేమీ ఉండవు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండవచ్చు. వ్యాపారులకు గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. వృత్తి నిపుణులకు ఆశించిన ఫలితాలు రాక నిరాశకు గురవుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. గణపతి ఆరాధన శుభప్రదం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. లక్ష్మీకటాక్షంతో సంపద వృద్ధి చెందుతుంది. సమాజంలో పేరున్న గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని విజయాలను అందుకుంటారు. దైవబలం అండగా ఉంటుంది. ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కీలక విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనిలో మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఏర్పడ్డ ఆటంకాలను బంధు మిత్రుల సహాయంతో అధిగమిస్తారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఫలవంతమైనదిగా ఉంటుంది. వివిధ రంగాల వారు ఆత్మబలంతో పనిచేసి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా, అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తోంది. మీ పనితీరు పట్ల ఉన్నతాధికారులు పూర్తి సంతోషం వ్యక్తం చేస్తారు. సామాజిక గుర్తింపు, పదోన్నతికి కూడా అవకాశం ఉంది! ఏ పని మొదలు పెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. అసూయా పరులు నిందలు మోపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆవేశానికి లోను కావద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేక పోతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు మానసికంగా కుంగదీస్తాయి. ఉద్యోగంలో కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. పట్టుదల లేకుంటే నెగ్గలేరు. కుటుంబ వాతావరణం ఏమంత అనుకూలంగా ఉండదు. అనారోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలాలు తొలగిపోతాయి.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైన వివాదాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. వృత్తి వ్యాపారాలలో గొప్ప శుభ యోగాలున్నాయి. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడం ఆనందాన్నిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. గిట్టని వారు మీపై దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోవద్దు. పట్టుదలతో ముందుకు సాగితేనే విజయం ఉంటుంది. శని శ్లోకాలు పఠిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలం పరిపూర్ణంగా ఉంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే కఠోరమైన కృషి అవసరమని గుర్తిస్తారు. సృజనాత్మకంగా వ్యవహరించి మీకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అనవసర వివాదాలలో జోక్యం చేసుకోకుంటే ఉత్తమం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. పెద్దలు, గురువుల ఆశీర్వాదాలు మేలు చేస్తాయి. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళతారు. శ్రీ మహాలక్ష్మీ దేవి ధ్యానం శుభకరం.