తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు గర్వం, అహంకారం వదిలిపెట్టాలి - లేకుంటే కష్టమే! - ఈ రోజు రాశిఫలాలు

Horoscope Today 28th January 2024 : జనవరి 28న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 28th January 2024
రాశి ఫలాలు

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 5:04 AM IST

Horoscope Today 28th January 2024 : జనవరి 28న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి శుభ ఫలితాలు లభిస్తాయి. వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నాళ్ల నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులను పూర్తిచేస్తారు. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ పిల్లలతో సరదాగా గడుపుతారు.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారు అన్నింటా విజయం సాధిస్తారు. పిత్రార్జితమైన సంపదలు మీకు కలిసి వస్తాయి. ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు కూడా పొందుతారు. మీ పిల్లల భవిష్యత్​ గురించి డబ్బులు ఆదా చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పని చేసి, అందరి చేత శభాష్ అనిపించుకుంటారు.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు కొన్ని ప్రాజెక్టులు మొదలుపెడతారు. ప్రభుత్వ పనుల్లో లాభాలు సంపాదిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. అయితే సన్నిహితుల మధ్య అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి ప్రతికూల ఫలితాలు రావచ్చు. శారీర, మానసిక ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రావు. అనైతికమైన పనులకు దూరంగా ఉండాలి.

సింహం (Leo) : ఈ సింహ రాశివారు లాభపడతారు. త్వరగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. అహంకారం, గర్వం విడనాడాలి. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. లేకుంటే మనశ్శాంతి పోతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. ఏ విషయానికీ కంగారు పడకండి. దైవ ధ్యానం చేయడం మంచిది.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారికి మంచి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. పనిప్రదేశంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆందోళన చెందకండి. చక్కగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక శాంతిని అందిస్తుంది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడిలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు ఎన్ని సవాళ్లు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. పనులన్నీ సంక్రమంగా పూర్తి చేస్తారు. కానీ ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

మకరం (Capricorn) :ఈ రోజు మకర రాశివారికి చాలా బాగుంటుంది. పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఏమీ రావు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలను కాస్త వాయిదా వేయడం మంచిది. దైవ ధ్యానం చేయాలి.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త దుస్తులు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కూడా కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి మధుర క్షణాలను ఆస్వాదిస్తారు.

మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందుతారు. వ్యాపార, వ్యవహారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. దైవ ధ్యానం చేయడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details