తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారికి అన్ని విషయాల్లోనూ ఆందోళనే- వాదనలకు దిగొద్దు!

Horoscope Today 26th January 2024 : జనవరి 26న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

horoscope-today-26th-january-2024
horoscope-today-26th-january-2024

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 6:11 AM IST

Horoscope Today 26th January 2024 : జనవరి 26న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :
ఈ రోజు మీకు మంచి జరగకపోవచ్చు. భావోద్వేగాల వల్ల మీరు మనస్తాపం చెందుతారు. తల్లికి అనారోగ్యం సూచనలు ఉన్నాయి. మిగతా విషయాలు కూడా ఆందోళన కలిగించేవే. మీ పరపతికి మచ్చ తెచ్చుకోకండి. మీరు ఆస్తి కోసం తీసుకునే నిర్ణయాలు ఈ రోజు వద్దు. మీ ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభం (Taurus) :
సమస్యలు, ఆందోళనలు మీలో కొత్త శక్తిని నింపుతాయి. మీరు ఉత్సాహంగా ఉంటారు. అదే సమయంలో మీరు బాగా సున్నితంగా, ఎమోషనల్‌గా మారుతారు. సృజనాత్మక వెల్లివిరుస్తుంది. ఏదైనా వ్యాసం లేదా కథ రాయడం ప్రారంభించండి.

మిథునం (Gemini) :
ఈరోజు నిదానంగా, స్థిరంగా ఉంది. పని పూర్తిచేయడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడితే ఆందోళన చెందవద్దు. సహనంతో ఉండండి. కాస్త ఆలస్యం అయినా సరే ఫలితాలు వస్తాయి. నిర్దేశించుకున్న పనులు, ఆర్థిక ఒప్పందాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి.

కర్కాటకం (Cancer) :
మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ అన్నీ వ్యవహారాల్లో కనిపిస్తుంది. మీరు ఈరోజు మీ స్నేహితులు, ప్రియమైనవారి సాంగత్యంలో గడపాలని కోరుకుంటారు. మీ స్నేహితులతో ప్రయాణించడానికి సఫలవంతమైన ప్రణాళికలు చేస్తారు.

సింహం (Leo) :
ఇతరుల మాటలకు అతిగా స్పందించవద్దు. మీ భాషను అదుపులో ఉంచుకోండి. సమస్యాత్మక పరిస్థితులు ఉన్నాయి. అతిగా వాదనతో కూడిన చర్చల నుంచి దూరంగా ఉండండి. న్యాయవిచారణలు, వ్యవహారాల జోలికి వెళ్లకండి.

కన్య (Virgo) :
ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి బాగా పెరుగుతుంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మహిళా స్నేహితులు ఉదారంగా, దయతో ఉంటారు. స్నేహితులతో సమయం గడపటం మీకు కలిసొస్తుంది.

తుల (Libra) :
ఇది మీకు జీవితంలో అన్ని విధాలా అదృష్టకరమైన రోజు. ఈరోజు మీకు ఏదీ కష్టంగా అనిపించదు. పని వద్ద వ్యవహారాలు సులభంగా పరిష్కారం అవుతాయి. ప్రియమైన వారితో ఇంటి వద్ద ఆహ్లాదకరమైన సంభాషణలు జరగడానికి అవకాశం ఉంది.

వృశ్చికం (Scorpio) :
మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీకు సులభంగా సెలవులు దొరకవు. మీ పని కష్టతరం అవుతుంది. ఈరోజంతా నీరసంగా, ఏకాగ్రత లేక తలమునకలై ఉంటారు.

ధనుస్సు (Sagittarius) :
మానసికంగా ఈరోజు చాలా ఇబ్బంది పడతారు. ఎక్కువగా భావోద్వేగాలు ప్రదర్శించకండి. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ భావోద్వేగాలను చూసి ఇతరులు భయపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రణలో ఉంచుకోండి.

మకరం (Capricorn) :
భావోద్వేగాలకు లొంగిపోకండి. భావోద్వేగాలు మీ విజయానికి అడ్డుగా నిలుస్తాయి. నిష్పాక్షికంగా ఉండటం ఈ సమస్యకు పరిష్కారం. అవకాశవాదులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోండి.

కుంభం (Aquarius) :
మీకు ఈ రోజు విజయం, కీర్తి, గుర్తింపు లభిస్తుంది. మీరు మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. తోటి ఉద్యోగుల సహకారం పొందుతారు. అది మీ పనులను సులభం చేస్తుంది. మీ పరపతి పెరుగుతుంది. అంతా మెచ్చుకుంటారు. కలివిడిగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయండి. మీరు మానసికంగా శారీరకంగా శక్తివంతంగా ఉంటారు. కొన్ని ఖర్చులు ఉండవచ్చు.

మీనం (Pisces) :
ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ వ్యాపారం లేదా విదేశీ పెట్టుబడుల నుంచి ధనప్రవాహాన్ని అందుకుంటారు. చక్కని పౌరసంబంధాలు నెరిపే మీ నైపుణ్యం మీకు ప్రయోజనం చేకూర్చుతుంది. ఊహించని కోణాల నుంచి మీకు మంచి డీల్స్ వస్తాయి. ప్రయోజనాలను అందిపుచ్చుకోండి. మీ పరిచయాలను సద్వినియోగం చేసుకోండి.

ABOUT THE AUTHOR

...view details