Horoscope Today December 12th 2024 : డిసెంబర్ 12వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున ఈ రోజంతా సుఖంగా, శాంతిమయంగా గడుస్తుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల శారీరకంగానూ, మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృవర్గం నుంచి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలు, ఘర్షణలకు అవకాశం ఉన్నందున సంయమనం పాటించాలి. సానుకూల దృక్పథంతో ఉంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి. చోరభయం, వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆంజనేయ దండకం పఠించడం శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు విశేషంగా కలిసి వస్తుంది. లక్ష్మీకటాక్షంతో మీరు పట్టింది బంగారం అవుతుంది. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ప్రయత్న పూర్వక కార్యసిద్ధి ఉంటుంది. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శుభకరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయ పరంపరలు కొనసాగుతాయి. గత కొంత కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యలు దూరమవుతాయి. సన్నిహితుల నుంచి అరుదైన బహుమతులను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. లక్ష్య సాధన వైపుగా ప్రయాణం సాగిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి నత్తనడకన నడుస్తుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకి ప్రణాళికలు వేస్తారు. కోపావేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి అందిన సమాచారంతో మానసిక శాంతి కొరవడుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అస్థిరమైన ఆలోచనలతో గందరగోళానికి గురవుతారు. అన్ని రంగాల వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇతరుల మాటలకు తీవ్రంగా ప్రభావం చెందుతారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయాత్నాలు ఫలించవు. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో కలిసి పని చేయడం సంతృప్తినిస్తుంది. పెరిగిన మీ ఆదాయాన్ని సంపదను చూసి ఆనందంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో విజయం సిద్ధిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. తారా బలం మెరుగ్గా ఉంటుంది. చెడు ప్రభావం తొలగి శుభ సమయం మొదలైంది. ఇంట్లోనూ, పని ప్రదేశంలోనూ వాతావరణం శాంతియుతంగా, ఉత్సాహంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆధ్యాత్మిక సాధనతో మానసిక శాంతి దొరుకుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతం తాలూకు చేదు అనుభవాల ప్రభావం ఇంకా తొలగిపోలేదు. అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి సహకారంతో కీలకమైన వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. వృధా ఖర్చులు నివారించండి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యం ఈ రోజు ఈ రాశి వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చు. కల్లోలమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు నష్టం చేస్తాయి. కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరుతాయి. శక్తి, ఉత్సాహం కోల్పోయిన అనుభూతి చెందుతారు. ప్రియమైన వారితో గొడవ పడే ఛాన్స్ ఉంది. శత్రుభయం ఉండవచ్చు. మొండితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా నష్టపోతారు. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. దుర్గాస్తుతి పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చెడు రోజులు పోయి మంచి రోజులు వస్తున్నాయి. గతంలో కన్నా ఈ రోజు అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగుల అధికార పరిధి పెరుగుతుంది. సామాజికంగా పేరొందిన వ్యక్తులను కలుసుకుంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మీనం (Pisces) :మీనరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మీ మాట తీరు కారణంగా ఇతరులతో అకాల వైరం ఏర్పడే ప్రమాదముంది. మాటలు జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. అనుకోని సంఘటనలు చెలరేగి బంధువులతో అభిప్రాయ భేదాలు నెలకొనే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.