Happy Birthday Rajinikanth : స్టైల్‌గా నడుస్తూ సిగరెట్ వెలిగించడం, కళ్లజోడు పెట్టుకోవడం, జుట్టు తిప్పడం - ఇలా రజనీకాంత్ తెరపై ఏది చేసినా కళ్లు అప్పగించడమే ప్రేక్షకుల వంతవుతుంది. అయితే నటుడిగా ఎన్నో అవార్డులు- రివార్డులు అందుకున్న ఈ సూపర్ స్టార్ పుట్టినరోజు నేడు (1950 డిసెంబరు 12). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని సంగతులు మీకోసం.
రజనీకాంత్ నటించిన తొలి చిత్రం అపూర్వ రాగంగళ్ (తమిళం) (Apoorva Raagangal). తొలి తెలుగు సినిమా అంతులేని కథ.
కెరీర్ ప్రారంభంలో రజనీ విలన్‌గా 20కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన భైరవి ఘన విజయం అందుకోవడంతో అప్పటి నుంచి సూపర్‌స్టార్ అయ్యారు.
అయితే రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్‌గా పనిచేశారు. కానీ అంతకన్నా ముందు ఆయన కూలీగా, కార్పెంటర్‌గానూ పని చేశారు.
2007లో, ఆసియాలో అత్యధిక పారితోషికం అందుకున్న రెండో నటుడిగా రజనీకాంత్ నిలిచారు. జాకీ చాన్‌ది అగ్రస్థానం.
సంపాదనలో 50 శాతాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తుంటారు రజనీ. ఎప్పటికైనా హిమాలయాల్లో స్థిరపడాలన్నది రజనీ చిరకాల కోరిక.
సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్. ఫ్రమ్ బస్ కండక్టర్ టు ఫిల్మ్‌స్టార్ పేరుతో సీబీఎస్‌ఈ ఆరో తరగతి విద్యార్థులకు రజనీ జీవితం ఓ పాఠంగా ఉంటుంది.
Superstar @rajinikanth sir as #Deva in #Coolie 💥💥
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 2, 2024
Thank you so much for this @rajinikanth sir 🤗❤️
It’s going to be a blast 🔥🔥@anirudhofficial @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @sunpictures @PraveenRaja_Off pic.twitter.com/TJxsgGdFfI
పద్మభూషణ్ (2000), పద్మ విభూషణ్ (2016), దాదా ఫాల్కే (2019) అవార్డులు అందుకున్నారు రజనీ. ఇక ఫాల్కే అవార్డును తన గురువు, దర్శకుడు బాలచందర్, మిత్రుడు (బస్ డ్రైవర్) రాజ్ బహుదూర్, తనతో సినిమాలు చేసిన వారికి, తమిళ ప్రజలకు అంకితమిచ్చారు.
మన్నన్, కొచ్చడైయాన్ సినిమాల్లో రజనీ కాంత్ పాటలు కూడా పాడారు. వల్లి (1993), బాబా (2002) చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు. నిర్మాత కూడా రజనీనే. తాను నటించిన సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే వారికి డబ్బును తిరిగిచ్చే కొత్త సంస్కృతిని పరిచయం చేసింది రజనీనే.
ఆ మధ్య రజనీ నటించిన సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ గతేడాది విడుదలైన జైలర్ ఆ లోటును తీర్చింది. ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా చేస్తున్నారు.
ఫైనల్‌గా, సిల్వర్ స్క్రీన్‌పై రజనీ మరిన్ని 'కాంతు'లీనాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Look test for #Coolie 🔥
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 26, 2024
On floors from July pic.twitter.com/ENcvEx2BDj
నార్త్‌లో షూటింగ్! - 29 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై రజనీ, ఆమిర్!