Hanuman Flag On Arjuna Chariot :వేదాలు, పురాణాలు హిందూ మతానికి సంపదలు. మన పురాణాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక యుగానికి మరో యుగానికి అనుసంధానం కనిపిస్తుంది. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని జెండా మీద త్రేతాయుగానికి చెందిన హనుమంతుని చిత్రం ఉండటానికి గల కారణం ఏమిటో తెలుసా! ఆసక్తి కలిగించే ఈ అంశాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు ఎందుకు?
ఒకానొక సమయంలో త్రేతా యుగానికి చెందిన హనుమంతుడు ద్వాపర యుగంలో అర్జునుని ముందు ప్రత్యక్షమయ్యాడంట! హనుమంతుడు అర్జునుని వద్దకు ఎందుకు వచ్చాడు? ఈ కథ ఏమిటో ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.
దేశయాటనలో అర్జునుడు
కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు. అలా అన్ని క్షేత్రాలు తిరుగుతూ రామేశ్వరాన్ని చేరుకున్నాడు. అక్కడ సాక్షాత్తు ఆ రాములవారు ప్రతిష్టించిన శివలింగాన్ని పూజించాడు. ఆపై సముద్రతీరాన తిరుగుతూ అక్కడ రామసేతువును గమనించాడు.
అర్జునుని సందేహం
వానరుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆ సేతువును చూడగానే అర్జునునికి ఓ ధర్మ సందేహం వచ్చింది. ‘రాముడు మహా శక్తి సంపన్నుడు కదా! గొప్ప విలుకాడు కదా! అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి? తనే స్వయంగా బాణాలతో ఓ దృఢమైన వంతెనని నిర్మించవచ్చు కదా!’ అని అర్జునుడు మనసులో అనుకున్నాడో లేదో శ్రీరాముని ధ్యానంలో ఉన్న హనుమకు ఆ సంగతి తెలిసిపోయింది.
సామాన్య వానరునిలా అర్జునుని వద్దకు హనుమ
అర్జునుని సందేహం తీర్చడానికి హనుమ సామాన్య వానరునిలా అర్జునుడి దగ్గరకు చేరుకుని "మీరు ఏదో సమస్యతో మధన పడుతున్నట్లు ఉన్నారు. ఏమిటీ విషయం?" అని అడిగాడు. దానికి అర్జునుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానరంకు తెలిపాడు.
అర్జునుని సందేహాన్ని తీర్చిన హనుమ
అర్జునుని సందేహాన్ని విన్న హనుమ "రాములవారు బాణాలతో సేతువుని నిర్మించ లేక కాదు! కానీ కొన్ని కోట్ల మంది వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే, రాళ్లతో నిర్మించే సేతువే సురక్షితమని తలచి రాముడు వానరులతో వంతెనని నిర్మింపచేశారు" అని అర్జునుని సందేహాన్ని తీర్చాడు హనుమంతుడు.
హనుమతో అర్జునుని వాదన
హనుమంతుడు చెప్పిన సమాధానంతో అర్జునుడు ఏకీభవించలేదు. పైగా రాములవారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సిందంటూ వాదనకు దిగాడు. క్రమేపీ మాటా మాటా పెరిగింది. ధర్మ సందేహం కాస్తా గొడవకు దారితీసింది.
అర్జునునికి హనుమ సవాల్
హనుమంతుడు అర్జునునితో "నువ్వు గొప్ప విలుకాడివని నీ నమ్మకం కదా! సాక్షాత్తూ ఆ రాములవారినే అనుమానిస్తున్నావు కదా! మరి బాణాలతో నువ్వో వంతెనని కట్టిచూడు. ఆ వంతెన మీద నేను నడుస్తాను. నా బరువుకి తట్టుకుని ఆ వంతెన నిలిస్తే సరే. లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా?’ అని సవాల్ విసిరాడు.