Do Not Donate These Things On Holi : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరమూ ఫాల్గుణ మాసం చివరి పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 25 సోమవారం రోజున జరుపుకోనున్నారు. అయితే.. హోలీ పండుగ రోజున కొన్ని వస్తువులు దానం చేయకూడదట. ఆ రోజున దానం చేస్తే ఇబ్బందులు వస్తాయట! మరి.. ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
తెల్లని వస్తువులు :
హోలీ పండుగ రోజున పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని వస్తువులను ఎవరికీ దానం చేయకూడదట. దీనివల్ల ఇంట్లో అశాంతులు కలుగుతాయని వాస్తు పండితులంటున్నారు. అలాగే ఇలా చేసిన వారికి జాతకంలో శుక్రుడి స్థానం బలహీన పడుతుందట. దీనివల్ల జీవితంలో అన్నీ కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు.
డబ్బు :
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హోలికా దహనం రోజున డబ్బును ఎవరికీ విరాళంగా ఇవ్వకూడదు. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందట. కాబట్టి, డబ్బులను ఎవరికీ దానంగా ఇవ్వకూడదట.
పైళ్లైన స్త్రీలు ఇవి దానం చేయకూడదు :
హోలీకా దహనం, హోలీ పండుగ రెండు రోజుల్లో.. పెళ్లైన స్త్రీలు పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, మేకప్ కిట్ వంటి ఇతర వస్తువులను దానం చేయకూడదట. దీనివల్ల వివాహ బంధంలో గొడవలు, కలహాలు కలుగుతాయి.
వస్త్రాలను దానం చేయకండి :
అలాగే ఈ రెండు రోజులలో పాత వస్త్రాలు, కొత్తవాటిని కూడా ఎవరికీ కూడా దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే దానం చేసిన వారి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి దూరమవుతుందట. ఇంకా వారి జీవితంలోఅశాంతినెలకొంటుందని తెలియజేస్తున్నారు.