Bhagavan Nama Smarana :కలియుగంలో భగవన్ నామస్మరణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఈ యుగంలో ప్రజల ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది. కనుక కృతయుగం, త్రేతాయుగం, ద్వారయుగంలో చేసినంత గొప్ప తపస్సులు, యజ్ఞ, యాగాదులు, పూజలు, వ్రతాలు చేయడం కష్టం. వీటిని సమకూర్చుకుని ఆచరించడం ఆర్థికంగానూ ఇబ్బందే. అంత పరివారమూ, వేదం, వాటి నిష్ట వంటివి సన్నగిల్లుతూ వచ్చే కాలం కలికాలం. అసలు కలికాలం అంటే దుర్మర్గమైన కాలం అని అర్థం.
Vishnu Nama Smaranam In Telugu :అయితే కలికాలం మాత్రం ఒక్క విషయంలో చాలా గొప్పది. ఈ కాలంలో యజ్ఞ, యాగాదులు వంటి క్రతువులు చేయకపోయినా, తపస్సులు, ధర్మములను చేయకపోయినా, కేవలం నామస్మరణ చేయడం ద్వారా మోక్షం పొందుతారు. అంటే నామస్మరణ చేయగా, చేయగా, మనలో బుద్ధి అంకురిస్తుందని అర్థం. 'హరే రామ హరే రామ రామ రామ హరేహరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే' అనే నామ మంత్రమే ముక్తికి మార్గం. ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుడినే సూచిస్తాయి. నామస్మరణకు ఎటువంటి నియమాలు లేవు. కేవలం మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనసులో జ్ఞానం చేసుకోవచ్చు. శ్రీరామ, శ్రీకృష్ణ ఏదైనప్పటికీ ఫర్వాలేదు. దీనికి ఎటువంటి నియమాలు లేవు, నామస్మరణ చేతే ప్రతి ఒక్కరూ తరించవచ్చు. ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నామస్మరణ చేయడం మంచిదే.
దేవుడి పేర్లు పెట్టడానికి కారణమిదే:
పూర్వం ఇంట్లో పిల్లలకు దేవుడి పేర్లు పెట్టడానికి వెనుక కారణం కూడా నామస్మరణే. నిత్యం ఏదో రూపంలో భగవంతుని నామస్మరణ చేయడం కోసం పిల్లలకు రామ, కృష్ణ, నారాయణ వంటి పేర్లతో భగవన్నామస్మరణ చేసుకోవచ్చని భావించేవారు. కార్తీక పురాణంలో దీని గొప్పతనం చెప్పేందుకు అజామరుడి వృత్తాంతాన్ని చక్కగా వివరించారు. యమభటులు కనిపిస్తున్నప్పుడు, కుమారుడిపై వ్యామోహంతో నారాయణ అని పిలవడం వల్ల అతడికి స్వర్గప్రాప్తి కలిగిందట. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎవరూ పిల్లలకు భగవంతుని పేర్లు పెట్టడం లేదు. అనునిత్యం భగవంతుని నామస్మరణ చేసుకోవాలంటే పిల్లలకు దేవుడి పేర్లు పెట్టాలి.
24 గంటలూ అవసరం లేదు
కలియుగంలో స్మరణ చేసి తరించవచ్చని మన సంప్రదాయం తెలియజేస్తున్నది. 24 గంటలూ స్మరణ చేయాల్సిన అవసరం లేదు. మన మనస్సు నిలకడగా ఉన్నప్పుడు స్మరణ చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. యాంత్రికంగా అర్చన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్షణక్షణానికి మన ఆయుర్దాయం తరిగిపోతున్నందున ప్రతి క్షణం స్మరణ చేయడం మంచిది.
ఎప్పుడు చేసినా ఫలితం పక్కా
సర్వకాల సర్వావస్థల్లోనూ నామస్మరణ చేసుకోవచ్చు. మంత్రాలకు మాత్రమే నియమాలు పాటించాల్సి ఉంటుంది. నామస్మరణ భక్తితో ఎప్పుడు చేసినా సరిపోతుందని, నిరంతరం భగవంతుని చింతలో ఉండటమే నామస్మరణ గొప్పతనమని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన ఉపదేశంలో నారద మునికి చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. తనకంటే గొప్ప భక్తుడు లేడని, నిత్యం నారాయణ స్మరణతో తరిస్తున్నానని నారదుడు గొప్పలకు పోతే విష్ణుమూర్తి మరో గొప్ప భక్తుడు ఉన్నాడని నారదుడికి చెబుతాడంట.