Best Flowers to Worship Lord Shiva on Maha Shivaratri: మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ పర్వదినాన ఆ భోళాశంకరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసంతోపాటు రాత్రంతా జాగరణ ఉంటారు. అయితే.. పండగ నాడు శివుడిని ప్రత్యేక పూలతో పూజిస్తే జీవితంలో సుఖసంతోషాలతో పాటు విజయం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు అంటున్నారు. మరి.. ఏ పూలంటే శివుడికి ఇష్టం? ఎలా పూజించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది?: తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. అయితే.. శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండడం ప్రధానం.. అందుకే మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో శివుడుని ఏ పూలతో పూజించాలో ఇప్పుడు చూద్దాం..
జుహీ ఫ్లవర్: ఆధ్యాత్మికతలో మాతృత్వం వంటి ప్రేమ, స్వచ్ఛత, స్త్రీ శక్తులకు ప్రతీకైన జుహీ పువ్వుతో శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎల్లప్పుడూ ధన ధాన్యాలతో తులతూగుతూ ఉంటారని చెబుతున్నారు.
జాస్మిన్ ఫ్లవర్: హిందూ ధర్మంలో ప్రేమ, స్వచ్ఛతను సూచించే సువాసనకు ప్రసిద్ధి చెందిన మల్లెపువ్వతో శివుడిని పూజించడం వల్ల అన్ని కోరికలూ నెరవేరుతాయని అంటున్నారు. అలాగే.. వాహన యోగం కూడా కలుగుతుందని అంటున్నారు. దాని చికిత్సా లక్షణాల కారణంగా మానసిక, శారీరక శ్రేయస్సును పెంచుతుందని పేర్కొంటున్నారు.
అల్సి ఫ్లవర్:దీనినే ఫ్లాక్స్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. తెలుగులో అవిసె పువ్వు అని అంటారు. అల్సి పువ్వును ఫైబర్ పంటగా సాగు చేస్తారు. మహా శివరాత్రి నాడు ఈ పువ్వును శివునికి సమర్పించడం వలన మంచి జరుగుతుందని, కోరిన కోర్కెలు తీరుతాయని అంటున్నారు. అలాగే ఇది విష్ణువు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు.