Astrological Remedies for Sudden Wealth : ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటే మీరు ఊహించని మార్గంలో ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి రావడం. మీరు ఉద్యోగం చేస్తున్నా, ఏదైనా వ్యాపారం నిర్వహిస్తున్నా ఏదో ఒక మార్గం ద్వారా డబ్బులు పొందడాన్ని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు. ఇలా జరగాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ పరిహారాలను ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.
తులసి మొక్కకు :
పూజ గదిలో శంఖం ఉంచుకోవాలి. శంఖం ఉంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శంఖంలో నీళ్లు తీసుకుని తులసి మొక్కకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఏదోక రోజు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుందట!
దర్భలు :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దర్భలకు చాలా శక్తి ఉంది. దర్భలతో ఏ దోషాన్నైనా తొలగించుకోవచ్చట. కాబట్టి ఏ రోజైనా భరణి నక్షత్రం ఉన్న రోజు కొన్ని దర్భలు ఇంటికి తెచ్చుకోండి. వాటిని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి పూజ గదిలోఉంచండి. ఆ మూటకు రోజూ ధూపం వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక లోటు లేకుండా ఉంటుంది. ఇంకా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలిగే అవకాశం ఉంటుంది.
దీపం పెట్టాలి :