YSRCP Leaders Sons Irregularities:ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ కుమారుడు కబ్జాలు, దోపిడీల్లో పీహెచ్డీ చేస్తే, ఇంకో పుత్రరత్నం ఏకంగా రౌడీషీటర్లనే వెనకేసుకుని తిరుగుతూ గ్యాంగ్‌ల్ని నడిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ అల్లర్ల కేసులో ఎవరెవరిపై కేసులు పెట్టాలో కూడా మంత్రి కుమారులే నిర్దేశించారంటే అధికార దుర్వినియోగానికి ఇంతకన్నా పరాకాష్ఠ ఇంకోటి ఉంటుందా? కక్షకట్టి తమను అల్లర్ల కేసులో ఇరికించారని, తన ఇంటిపై దాడి చేయించారని వైసీపీ నాయకుడే వాపోయే పరిస్థితి నెలకొంది.
డీఎస్పీపైనే తిరగబడ్డ మంత్రి పుత్రరత్నం:ఎక్కడైనా భూవివాదం ఉందంటే రౌడీషీటర్లను అక్కడకు పంపి పంచాయితీ పెడతారు. ఎకరాకు 5లక్షల రూపాయలకుపైనే వసూలు చేస్తారు. తమ తీర్పును పట్టించుకోని వారిపైకి అధికారుల్ని ఉసిగొల్పుతారు! మరో కుమారుడైతే తానే ఎమ్మెల్యేని అన్నట్లు అధికారులు, పోలీసుల్ని వెంటేసుకుని తిరిగేస్తుంటారు. గతంలో నడిరోడ్డుపైనే పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. అల్లర్ల కేసులో తమను అన్యాయంగా ఇరికించారంటూ నిలదీసిన గ్రామస్థుల్ని ఠాణాలో పెట్టించి వేధించారు. సైలెన్సర్లు తీసేసి అతివేగంతో వెళ్తున్న బైకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఏకంగా డీఎస్పీపైనే తిరగబడ్డాడు ఆ మంత్రి పుత్రరత్నం. ఆ తర్వాత తండ్రి కూడా కుమారుడ్నే వెనకేసుకొచ్చి పట్టుకున్న బైకులతోపాటు మరికొన్నింటిని ఎత్తుకెళ్లారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - ap intermediate 2024 results
రైతుల భూములు కబ్జా:ఇక కైకలూరుకు మూలస్తంభాన్ని అని చెప్పుకునే నాయకుడి కుమారుడైతే పోలీసుల్ని అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లలో ఆరితేరాడు. కైకలూరులో 64 మంది రైతులు వందెకరాల పొలాల్ని చేపల చెరువులుగా మార్చి లీజుకిస్తున్నారు. దానిపై ఆ నేతాశ్రీ కుమారుడి కన్నుపడింది. ఇక అంతే కౌలుదారుడ్ని బెదిరించి తరిమేశారు. చేపల్ని పట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇకపై ఆ చెరువుల్లో తామే పంట వేస్తామని, ఇచ్చినంత తీసుకోండని రైతులకు హుకుం జారీ చేశారు.
ఇదే అన్యాయం అంటూ రైతులు స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు సరికదా? ఎంతోకొంత ఇచ్చి సెటిల్ చేసుకోండంటూ ఒత్తిడి తెచ్చారు. చివరకు రైతులే తమ భూముల్ని లీజుకిస్తున్నట్లు స్టాంపు పత్రాలపై సంతకాలు పెట్టేలా చేశారు. తమపై ఎవరి ఒత్తిడి లేదంటూ వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో పెట్టించారు. మండలానికి ఒకర్ని పెట్టి 4 మండలాల్లో మట్టి మాఫియాను నడిపిస్తున్నాడు ఆ పుత్రరత్నం.
టీడీపీ తరఫున పోటీ చేయటానికి వీల్లేదంటూ హుకుం:సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై రౌడీగ్యాంగ్‌తో దాడి చేయిస్తున్నారు. ఎస్సై, సీఐ స్థాయి అధికారులే ముఖ్యనేత కుమారుడి దగ్గరే గొడవ సెటిల్ చేసుకోడంటూ పంపిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని 4 మండలాల్లో తెలుగుదేశం తరఫున ఎవరూ నిలబడడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు.