YSRCP MLC Anantha Babu Issue :వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) అరాచకాలకు అంతే లేదు. గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే! అలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్కయిపోయారు. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇదే కాక అవతలి వారితో అనంతబాబు మాట్లాడుతూ వారికి ముద్దులు పెట్టడంతోపాటు జుగుప్సాకరంగా ప్రవర్తించినట్లుగా మరో వీడియో కూడా వైరల్ అయింది. తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి కొన్ని నెలలుగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అనంతబాబు చెప్పుకొచ్చారు. తన వీడియోలను మార్ఫింగ్ చేసి, దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
YSRCP Leaders Fires on Anantha Babu : తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబుపై సొంత పార్టీ నేతల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ‘న్యూడ్ వీడియోల నాయకుడు మాకొద్దు. విలువలు, విశ్వసనీయత లేని నాయకుడి నేతృత్వంలో పనిచేయబోం’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల నాయకులంతా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ మండల అధ్యక్షుడు తానికొండ వాసు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నర్సింహరావు ఆధ్వర్యంలో సోమవారం ఎటపాకలో పార్టీ సమావేశం నిర్వహించారు.