APSRTC Bus Launch From Muddalapuram to Kalyandurg: అనంతపురం జిల్లాలోని ముద్దలాపురం గ్రామంలో బస్సు సౌకర్యం లేక పాఠశాల విద్యార్థులు చాలా కాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వెంటనే మారుమూల గ్రామమైన ముద్దులాపురానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటయింది. ఈ బస్సును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభించారు.
ముద్దలాపురం గ్రామానికి బస్సు సౌకర్యం: బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామానికి గత 75 ఏళ్ల నుంచి ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయాన్ని గ్రామస్థులు, విద్యార్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి వెంటనే గ్రామానికి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. సురేంద్రబాబు ముద్దులాపురం గ్రామం నుంచి కళ్యాణదురానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. చదువుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని బస్సును ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. అతి త్వరలోనే రోడ్లన్నీ బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు: ముద్దలాపురం గ్రామానికి ఎన్నో ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయం లేదని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే గ్రామానికి బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా బస్సు ఏర్పాటు చేయడంపై విద్యార్థులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
''ఈరోజు మనమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలపాలి. ఈ గ్రామ ప్రజలు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. దాంతో మంత్రి నారా లోకేశ్ ఆయనతో మాట్లాడటం వలన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు చొరవ చూపి సకాలంలో బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చదువుకోవడానికి ఏ విద్యార్థి ఇబ్బందులు పడకూడదని బస్సును ఏర్పాటు చేయడం జరిగింది''-అమిలినేని సురేంద్రబాబు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే
దేవాలయాల్లో తొలిసారిగా విద్యుత్ బస్సును ప్రారంభించిన సింహాచలం దేవస్థానం - Simhachalam Devasthanam
Electric Bus: కడప-తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు.. ప్రారంభించిన ఆర్టీసీ ఛైర్మన్
3,500 మంది డ్రైవర్లతో 2 వేల బస్సుల్లో - మహిళలకు ఉచిత ప్రయాణం! - Free Bus Scheme in AP