ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వైరల్ ఫొటో - హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue - YSRCP KUKKALA VIDYA SAGAR ISSUE

YSRCP Leader kukkala Vidya Sagar Issue: వైఎస్సార్సీపీకి చెందిన నేతలు ఓ హీరోయిన్‌ను వేధించారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఓ యువతితో కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు విద్యాసాగర్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.

YSRCP Leader kukkala Vidya Sagar Issue
YSRCP Leader kukkala Vidya Sagar Issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 10:29 AM IST

Updated : Aug 27, 2024, 10:46 AM IST

YSRCP Leader kukkala Vidya Sagar Issue: కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ ముంబయికి చెందిన ఓ సినీనటిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని, ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించిన వార్త (YSRCP Leaders Harassment) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినీనటితో విద్యాసాగర్​ గతంలో తీసుకున్న ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కుక్కల విద్యాసాగర్ (ETV Bharat)

ఇదీ జరిగింది: 2014లో వైఎస్సార్సీపీ తరఫున కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్‌ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ వివాహానికి వెళ్లారు. అక్కడ ఓ సినీనటితో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్‌ని సినీనటి కోరగా అందుకు అతడు నిరాకరించారు.

ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో, ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని, నాటి ప్రభుత్వ పెద్దల సాయంతో ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేయాలనుకున్నారు. అనుకున్నట్టు గానే అధికార బలాన్ని ప్రయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులపై బెదిరించారు. అంతే కాకుండా వారిని జైలుకి సైతం పంపించారు.

కుక్కల విద్యాసాగర్ (ETV Bharat)

సినీనటిని అరెస్టు చేసి: హీరోయిన్​ని, ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్టు చేసి జైలుకి పంపించారు. వారు జైలు నుంచి విడుదలైన తరువైత కూడా వారిని తీవ్రంగా బెదిరించారు. పెళ్లి మాటెత్తితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో దిక్కుతోచని స్థితిలో వారు ఇక్కడ నుంచి వెళ్లిపోయింది. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

తీగ లాగితే డొంకంతా కదిలినట్లు, ప్రస్తుతం ఈ ఉందంతంలో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

హీరోయిన్‌ను వేధించిన వైఎస్సార్సీపీ నేతలు, కొందరు ఐపీఎస్‌లు - YSRCP Leaders Harassed Actress

Last Updated : Aug 27, 2024, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details