YS Sharmila Allegations on MP Avinash Reddy:వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్ అప్పుడే చెప్పొచ్చు కదా అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. హంతకుల కాల్ రికార్డ్స్‌తో అవినాష్ కాల్ రికార్డ్ మ్యాచ్ అయ్యాయని తెలిపారు. హంతకులకు మీకు ఉన్న సంబంధాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని అన్నారు. ఇల్లంతా రక్తం ఉంటే గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. వివేకా నన్ను పోటీ చేయాలని అడిగితే చేయనని చెప్పానని నాకు ఎంపీ సీట్ కావాలనుకుంటే ఆరోజే వచ్చేది కదా అని షర్మిల అన్నారు.
వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్ అప్పుడే చెప్పొచ్చు కదా: షర్మిల బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్ షర్మిల - YS Sharmila Blames Jagan
అప్పుడు నేనే అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచానని షర్మిల తెలిపారు. జగన్ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా కానీ ఏ రోజు కూడా పదవి కావాలని అడగలేదని అన్నారు. జగన్ కోసం తన పార్టీ కోసం ఇంత చేసిన ఇవాళ నన్ను, సునీతను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లు దాటినా హంతకులకు శిక్ష పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వివేకా బిడ్డే చంపిందని ముద్ర వేశారని అన్నారు. సీఎం జగన్ స్వయంగా హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లు హంతకులను కాపాడి మళ్లీ వాళ్లకే టికెట్ ఇచ్చారని షర్మిల అన్నారు.
నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case
పుట్టుకను అవమానించే విధంగా దుష్పచారం:సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వైసీపీ నేతలు తనపై దుష్పచారం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. తన పుట్టుకనే అవమానించే విధంగా మాట్లాడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నేను వైఎస్ షర్మిలా రెడ్డి కాదని వైఎస్‌కే పుట్టలేదని వైసీపీ నాయకులు అంటున్నారని అన్నారు.
గోదావరి జిల్లాల్లో ఆయన ఓ అరాచక 'గ్రంథం'! - YCP leader irregularities
అందుకే కడపలో పోటీ చేస్తున్నా: వివేకా కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా ముద్ర వేసిందని, అలాంటి వ్యక్తికి మళ్లీ ఎలా టిక్కెట్ ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఎందుకు నిజం దాచి పెడుతున్నారని అన్నారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. హత్యారాజకీయాలు ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని పేర్కొన్నారు. సీబీఐ నిందితుడు అని చెప్తున్న అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం వల్లనే తాను కడపలో పోటీ చేస్తున్నానని షర్మిల తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆశీర్వదించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.