ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

"ఆ ఉపాధ్యాయురాలికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాం- నీకూ అదే గతి పడుతుంది" - మాజీ మంత్రిపై మహిళ ఫిర్యాదు

వైఎస్సార్​సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై పోలీసులకు మహిళ ఫిర్యాదు - ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపణ

complaint_on_meruga_nagarjuna
complaint_on_meruga_nagarjuna (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2024, 3:20 PM IST

Updated : Nov 1, 2024, 7:49 PM IST

Woman Complaint on Former Minister Meruga Nagarjuna:వైఎస్సార్​సీపీ నేతలు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా వైఎస్సార్​సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై విజయవాడకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావలసిన డబ్బులు విషయంలో సహాయం చేస్తానని లోబరుచుకొని ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మూడు సంవత్సరాలుగా శారీరకంగా అనుభవించి 90 లక్షల రూపాయలను తీసుకొని ఇవ్వకుండా చంపేస్తానని బెదిరిస్తున్నారని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరిజన శాఖలో పనిచేసే ఉపాధ్యాయురాలిని స్లో పాయిజన్ ద్వారా చంపేశామని, ఇప్పుడు నీకూ అదే గతి పడుతుందని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. మేరుగ నాగార్జున వ్యక్తిగత సహాయకుడు మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధిత మహిళ వెల్లడించారు. ఈ మేరకు తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజుకు మహిళ ఫిర్యాదు చేశారు.

"ఆ ఉపాధ్యాయురాలికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాం- నీకూ అదే గతి పడుతుంది" - మాజీ మంత్రిపై మహిళ ఫిర్యాదు (ETV Bharat)
Last Updated : Nov 1, 2024, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details