Who will Win in AP : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి ఏంటి? తండోపతండాలుగా తరలివచ్చిన ఓటర్లు ఏ బటన్ నొక్కారు? భారీగా నమోదైన పోలింగ్‌ను ఎలా భావించాలి? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? విశాఖను రాజధాని చేస్తామన్నా ఉత్తరాంధ్రలోనూ అధికార పార్టీపై వ్యతిరేకతకు కారణాలేంటి? సర్వేలు ఏం చెప్తున్నాయి? ఏ అంశాలను పరిశీలించాయి? ఏఏ వర్గాల అభిప్రాయాలను సేకరించాయి? విజయానికి ప్రాతిపదిక ఏంటి? ఓటమిని ప్రభావితం చేసే కారణాలను ఎలా అంచనా వేయాలి? అధికార పక్షం ఉలిక్కిపడిందా? ప్రతిపక్షాల ధీమా ఏంటి? పదండి! పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati
2014, 2019 ఎన్నికల్లోనూ భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్సీపీని ఆదరించారు. భారీగా నమోదైన పోలింగ్ అధికార మార్పిడికి దారి తీసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేక పోయింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ఇచ్చిన వాగ్దానాలు ప్రజల దృష్టిని మళ్లించాయి. ప్రధానంగా ఏటా జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పంటకు మద్దతు ధర హామీలు అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి.
2014లో రాష్ట్ర విభజన అంశం, కాంగ్రెస్‌పై పెరిగిన వ్యతిరేకత భారీ పోలింగ్‌కు బీజం వేసింది. రాష్ట్ర పునర్నిర్మాణం ఐటీ విజనరీ చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు అధికారాన్ని అప్పగించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతి రాజధాని నగరానికి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు వైఎస్సార్సీపీ విజయానికి దోహదం చేశాయి. కానీ, 2024 ఎన్నికలు వచ్చేనాటికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ విఫలమైంది. ప్రధాన హామీలను విస్మరించి పైపై మెరుగులు రుద్దే ప్రయత్నం చేసింది. బటన్ నొక్కుతున్నామంటూ పథకాల పేరిట డబ్బు పంపిణీ తప్ప ఏ ఒక్క అడుగు ముందుకు పడలేదు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నగర నిర్మాణాలు పడకేశాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఊసేలేకపోగా, పాత ప్రాజెక్టుల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టుకు నీరందించలేకపోయింది. విద్యుత్ బిల్లులు, చెత్త పన్నులు, పెరిగిన ఆర్టీసీ చార్జీలు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించాయి.
ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ - MLA Beat Voter