Varla Ramaiah Complaint to Chief Election Officer Against YCP:వైసీపీ "www.tdpagainstpoor.com" అనే పేరుతో వెబ్‌సైట్ క్రియేట్ చేసి తెలుగుదేశంపై విషప్రచారం చేస్తుందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాసారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతున్నారని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాక్ స్వాతంత్య్రం , భావవ్యక్తీకరణ, స్వేచ్ఛ పరిమితి లేనిది కాదన్నారు. నైతిక హద్దులను దాటరాదని, వక్రీకరణల ఆధారంగా ఇతర పార్టీలు, కార్యకర్తలపై విమర్శలు చేయరాదని స్పష్టంగా తెలియజేస్తోందని వెల్లడించారు.
ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు - భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం - POLICE CHECKING THE VEHICLES
వైసీపీ దురుద్దేశంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న వీడియోను లేఖకు జత చేసారు. వైసీపీపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పెనమలూరులో 80 ఏళ్ల వృద్ధురాలు వజ్రమ్మ మరణంపై మంత్రి జోగి రమేష్ దుష్ప్రచారం చేస్తున్నారని మరో లేఖలో ఫిర్యాదు చేశారు. వృద్దురాలి బంధువులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని జోగి రమేష్ కోరడం దుర్మార్గమని మండిపడ్డారు. మృతదేహాన్ని చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లేలా బంధువులను ప్రభావితం చేసేందుకు మంత్రి ప్రయత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ ఉద్దేశ్యంతో శవాన్ని ప్రచారానికి వినియోగించుకోవాలని చూశాడని ధ్వజమెత్తారు.
వైసీపీ శవరాజకీయాలు చేస్తోంది - పింఛన్ ఇవ్వకుండా చేసే కుట్రను అడ్డుకుంటాం: టీడీపీ - pensions Distribution issue in ap
వృద్దురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గాడన్నారు. మరణించిన వారిని కూడా వదలకుండా రాజకీయ ప్రచారానికి వాడుకోవాలని చూడటం దారుణమని అన్నారు. జోగి రమేష్‌పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని యథేచ్ఛగా ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని లేఖలో తెలిపారు. గుడివాడలోని ఎన్నికల ప్రచారంలో నానిని ఇళ్ల పట్టాల విషయంలో ప్రజలు ప్రశ్నించారు. దీంతో నాని అర్హులైన వారికి వెంటనే పాత తేదీలతో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ ఆర్డీఓ పద్మావతికి పోన్ చేశారన్నారు. ఆర్డీఓ పద్మావతి నాని ఆదేశాలను తిరస్కరించి పోన్ పెట్టేశారని గుర్తు చేశారు. రాజకీయ లబ్ది కోసం పాత తేదీలతో ఇళ్ల పట్టాలు ఇవ్వాలనడం దుర్మార్గమని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని దుయ్యబట్టారు.
వైసీపీ కంబంధ హస్తాల్లో పోలీసులు ! - బాధితులపైనే ఎదురు కేసులు - YSRCP Leaders Attack on TDP
దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం:సీఎం జగన్‌లా ఎవరూ అబద్ధాలు ఆడలేరని వర్ల రామయ్య ఆరోపించారు. 2004లో ఏమీలేని జగన్ ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మారారని ఆయన ఆరోపించారు. ఇంత తక్కువ సమయంలో జగన్‌లా డబ్బులు సంపాదించిన వారు దేశంలోనే ఎవరూ లేరని ఆ సంపాదన అంతా అవినీతి, అక్రమమేనని అన్నారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో చెంపదెబ్బ కొట్టడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారని అన్నారు. నందిగామలో వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా చేతులు దులుపుకున్నారని ఆయన సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈసీ ఐపీఎస్ లపై బదిలీ వేటు వేసిందని పోలీసులు గుర్తించుకోవాలన్నారు.
వైసీపీ నేతలకు సీఈఓ నోటీసులు జారీ: వర్ల రామయ్య పిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వైసీపీ నేతలైన జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డిలకు నోటీసులు జారీ చేసారు. నోటీసు అందిన 48 గంటల్లో ఇరువురు నేతలు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. చంద్రబాబు వల్లే పింఛన్లు ఆగాయంటూ ప్రచారం చేయాలని వాలంటీర్లకు జోగి రమేష్ చెబుతున్న వీడియోను ఎన్నికల సంఘానికి వర్ల పంపిన వీడియోను ఆధారంగా చేసుకుని జోగి రమేష్‌కు నోటీసులు జారీ చేసింది. పేదలకు అందుతున్న మంచిని నిలిపేశారని, వాలంటీర్ల సేవల నిలిపివేతతో పేదోడి నోటికూడు లాగేశారని చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ అధికారిక ఎక్స్(ట్విట్టర్)లో చేసిన ఫోస్ట్పై ఈసీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసు జారీ చేసింది.