ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పడిలేచిన కెరటం - ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం - ap elections 2024

TDP Victory in AP Elections 2024 : పడి ఎగిసిన కెరటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇందుకు తగ్గట్టుగానే ఉవ్వెత్తిన ఎగిసి పడిన యువకెరటంలా సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చిన ఈ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మునుపెన్నడూ లేని విధంగా క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొని, వాటిని అధిగమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ పని అయిపోయిందన్న సూటిపోటి మాటలు ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలు, ఫినిష్ అంటూ మరికొందరి బెదిరింపులు, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులు, అధినేత చంద్రబాబు సైతం జైలుకెళ్లటం వంటి అనేక సంక్షోభాలను తట్టుకుంటూనే ప్రజామద్దతును కూడగట్టి జయకేతనం ఎగురవేసింది. అధికార పార్టీ ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగించిన చంద్రబాబు తన రాజకీయ చాణిక్యంతో మరోసారి సత్తా చాటారు.

ap_elections_2024
ap_elections_2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 12:34 PM IST

TDP Victory in AP Elections 2024 : అది 2019 సంవత్సరం మే 23, సరిగ్గా 5ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటే క్రమేణా పసుపు శిబిరం ఖాళీ అవుతూ వచ్చింది. 4దశాబ్దాల ఘనకీర్తి కలిగిన తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాన్ని ఎదుర్కొంది. నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని కాదని ప్రజలు జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ వైపు మొగ్గుచూపటంతో పసుపు శ్రేణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కేవలం 23అసెంబ్లీ 3పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పార్టీ ఆవిర్భవించాక ఎన్నో గెలుపోటమలు చూసిన పార్టీ ఇంతటి ఘోరమైన ఫలితాలను మునుపెన్నడూ ఎరుగదనే చెప్పాలి.

అప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ చుట్టూ ఉన్న నాయకులు, నేతలూ క్రమేణా తగ్గుముఖం పట్టారు. అధినేత చంద్రబాబు వయోభారాన్ని ఎత్తి చూపుతూ ఇక పార్టీ పనైపోయిందని ఫలితాల రోజు పసుపు శిబిరంలోనే కొందరు గుసగుసలాడారు. 23వ తేదీ ఫలితం తెలుగుదేశం పార్టీని 23కే పరిమితం చేసిందంటూ వైఎస్సార్సీపీ దెబ్బిపొడిచింది. 5ఏళ్లు కాలం గిర్రున తిరిగింది. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి అన్నట్లుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. 5ఏళ్లు సర్వశక్తులు ఒడ్డి ప్రజల పక్షాన పోరాడారు. మొత్తంగా ఈ ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా ప్రజలు భావించారు. 2024సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరిగి ఘన విజయాన్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు - ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ అరాచకాలు: చంద్రబాబు - Chandrababu reaction

విజయాహంకారంతో విధ్వంస పాలన అందించిన వైఎస్సార్సీపీని ప్రజలు ఛీ కొట్టారు. పాలనా అనుభవం, రాజకీయ చతురత ఉన్న చంద్రబాబుకు జై కొడుతూ తిరిగి అధికార పగ్గాలు అందించారు. అయితే, ఈ విజయం ఆషామాషీగా వచ్చింది కాదు. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు 'క్లెమోర్ మైన్స్ పేలి 30అడుగులు ఎత్తుకి కారు ఎగిరి కింద పడినా.... చొక్కా దులుపుకుని రాజకీయ సేవ చేద్దాం పదండి' అన్నట్లే చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా వ్యవహరించారు. క్యాడర్‌ చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ అతి త్వరలోనే పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపి మళ్లీ పుంజుకునేలా చేశారు.

2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన శక్తులన్నీ ఈ ఎన్నికల్లో జగన్ కి వ్యతిరేకంగా పనిచేసేలా రాజకీయ చతురత ప్రదర్శించారు. అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ ముఖ్య నాయకులు అనేక మందిని జైల్లో పెట్టింది. పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలపైనా పెట్టిన అక్రమ కేసులు, అరాచకాలకు లెక్కేలేదు. వాటన్నిటినీ ఎదుర్కొంటూ చంద్రబాబు పార్టీని ముందుకి నడిపించారు. యువగళం పేరుతో లోకేశ్‌ చేసిన సుదీర్ఘ పాదయాత్ర... పార్టీని యువతరానికి ప్రజలకూ మరింత చేరువ చేసేందుకు దోహదం చేసింది. రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమైన టీడీపీతో జనసేన, బీజేపీ మళ్లీ జట్టుకట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం ఖరారైంది.

2019 సంవత్సరం.. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వ పనితీరును కొంతకాలం సమీక్షించి ఆ తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షంగా పోరాడతామని ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధించిన ఘన విజయంపై చంద్రబాబు స్పందించారు.

కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజు ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంగణాన్ని కూలకొడుతున్నట్లు విధ్వంస ప్రకటన చేశారు. ప్రతిపక్షంతో పాటు రాష్ట్ర ప్రజలకీ వైఎస్సార్సీపీ పాలనా విధానంపై ఆ ఒక్క నిర్ణయంతో స్పష్టమైన అవగాహన వచ్చేసింది. ఇక ఉపేక్షిస్తే రాష్ట్రమంతటా విధ్వంసమే జరుగుతుందనే భావనతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల పక్షాన పోరాడటం ప్రారంభించారు. సంఖ్యాబలం తక్కువున్నా, నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నా, ఏమాత్రం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటానికి శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయంగా వాడుకుందామనుకున్న ప్రజావేదికను కూలగొట్టడం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఇంకా అందుబాటులోకి రాకపోవటంతో కొంత కాలం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు రాష్ట్ర కార్యాలయంగా వాడుకుని కార్యక్రమాలు నిర్వహించారు.

ఎన్నికల్లో వచ్చిన విజయగర్వంతో తెలుగుదేశం నేతలపై వైఎస్సార్సీపీ హింసాత్మక దాడులకు పాల్పడింది. పల్నాడు ప్రాంతంలో దాడులకు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్న కార్యకర్తల కుటుంబాలకు గుంటూరులో ఆశ్రయం ఏర్పాటు చేయించారు. వారికి ధైర్యం చెప్పి తిరిగి వారి స్వస్థలాల్లో దిగపెట్టి కొంతకాలం అక్కడే వారి మధ్యే ఉండేందుకు చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసు బలగాల సాయంతో చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం ఆయన ఇంటి గేట్లకు తాళ్లు కట్టించటం సంచలనమైంది. నవ్యాంధ్ర అసెంబ్లీకి తొలి స్పీకర్ గా పనిచేసిన సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపైనా వేధింపులకు దిగింది. తన క్యాంపు కార్యాలయంలో ఉన్న అసెంబ్లీ సామగ్రిని స్వాధీనం చేసుకోమని కోడెల రాసిన లేఖను తొక్కిపెట్టిన ప్రభుత్వం, సామగ్రి చోరీ చేశారంటూ మానసికంగా అసత్య ఆరోపణలతో వేధించటంతో పల్నాటి పులిగా బతికిన కోడెల సైతం ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

తెలుగుదేశం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వీడి వైఎస్సార్సీపీ పంచన చేరారు. అటు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ఎంపీలు గరికిపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. తెలుగుదేశం ఇక ఖాళీ అనే వాతావరణం పార్టీలో నెలకొంది.

రాష్ట్రాలు రెండుగా మారినా తెలుగు ప్రజలంతా ఒక్కటే: చంద్రబాబు - Chandrababu tweet

2020 వ సంవత్సరం... 2019డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన 3రాజధానుల ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిపివేసి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్మానుషంగా మార్చింది. భవిష్యత్తు తరాల రాజధానికోసం 33వేల ఎకరాలు భూ త్యాగం చేసిన అమరావతి రైతులు ఉద్యమబాట పట్టారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన అమరావతి పర్యటనలో పోలీసులు దగ్గరుండి వైఎస్సార్సీపీ శ్రేణులతో రాళ్లు వేయించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై పడిన రాయిని నాటి డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ రాజ్యాంగం నిరసనకారులకు కల్పించిన హక్కు అది అన్నట్లు మాట్లాడారు. అదే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో అధికార పార్టీ హింసను ప్రేరేపించింది.

దాడులు, దౌర్జన్యాలతో పంచాయితీలను ఏకగ్రీవం చేసుకుంటూ పోలీసు సహా ఇతర ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసింది. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేయనీయకుండా దాడులు, హత్యలు, అక్రమ కేసులు వంటి చర్యలకు పూనుకుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే వాతావరణం లేదని గ్రహించిన తెలుగుదేశం స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించింది. పార్టీ ఆవిర్భించాక తొలిసారి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ఏడాది కరోనా కారణంగా ఏటా మేలో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించే మహానాడును జూమ్ లో నిర్వహించారు. సాంకేంతికతను ఉపయోగించి ఓ భారీ కార్యక్రమాన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ విజయవంతంగా నిర్వహించిన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు వచ్చేలా చంద్రబాబు చేశారు. ఇసుక, మద్యం, ఇతర ప్రజా సమస్యలపై తెలుగుదేశం తన పోరాటం కొనసాగించేలా నాయకత్వం వహించారు.

2021.. రాష్ట్రంలో ఓవైపు కరోనా కోరలు చాచుతుంటే ప్రతీకార దాడులకు హద్దే లేదన్నట్లుగా వైఎస్సార్సీపీ ప్రవర్తించింది. పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, పట్టాభి తదితరులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప లాంటి నేతలపై అత్యాచారం కేసులు పెట్టింది. జగన్ మంత్రివర్గ విస్తరణ యోచన చేస్తున్నారని తెలుసుకుని ఆయన మెప్పు కోసం ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయారు. పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రకు వెళ్లి యుద్ధవాతావరణం సృష్టించారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పైనా వైఎస్సార్సీపీ మూకలు దాడులకు దిగి విధ్వంసం సృష్టించాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో తెలుగుదేశం నేత పట్టాభి ఇంటిపైనా దాడికి పాల్పడ్డారు. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం నేతలు వరుస హత్యలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెప్తూనే వారికి అండగా ఉంటూ వైఎస్సార్సీపీ విధ్వంసానికి అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు తన పోరాట పంథా కొనసాగించారు. అధికార పార్టీ విధ్వంస విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా చేసి వివిధ పక్షాలు, వర్గాల మద్దతును చూడగొన్నారు.వివిధ కారణాల వల్ల పార్టీకి దూరమైన సంఘాలు, సామాజిక వర్గాలు తిరిగి తెలుగుదేశం వైపు వచ్చేలా చేయగలిగారు.

ఏపీలో గెలిచేదెవరో తెలుసా?- భారీ పోలింగ్​ వెనుక కారణాలేంటి? - AP ELECTION RESULT

2022వ సంవత్సరం మూడేళ్లుగా తిడితే సహిస్తూ, అవమానాలు భరిస్తూ, దాడులు తట్టుకుంటూ, హింసను ప్రతిఘటిస్తూ వచ్చిన తెలుుదేశం పార్టీకి ఒంగోలు మహానాడు గొప్ప జోష్ నిచ్చింది. తెలుగుదేశం పార్టీ 40ఏళ్ల చరిత్రలో మహానాడులు 30కిపైగానే జరిగాయి. తొలిసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నిర్వహించిన మహానాడు చరిత్రలో నిలిచిపోతే మళ్లీ అదే స్థాయిలో ప్రజా స్పందన దక్కిన మహానాడుగా ఒంగోలు వేడుకనే చెప్పొచ్చు. 83లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య జరిగిన మహానాడుకు ఎంతో వ్యత్యాసం ఉన్నా టీం స్పిరిట్ తో వేడుకను ఘనవిజయం చేసేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెరవెనుక క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సన్నదంగా ఉన్నమన సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా ఇచ్చింది.

రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత ఇంత భారీ స్థాయిలో ఒక రాజకీయపార్టీ సభ జరగడం, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ ఇచ్చిన పిలుపుతో కొన్ని లక్షల మంది స్వచ్ఛందంగా తరలిరావడం ఇదే మొదటిసారి. మహానాడు విజయవంతమవటంతో ప్రభుత్వం ప్రతిపక్షాలపై నిర్బంధకాండను మరింత పెంచింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విశాఖలో పోలీసులు అడ్డుకున్న తీరును ఖండించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా కలిసి పరామర్శించటంతో రెండు పార్టీల పొత్తు బంధానికి బీజం పడింది. విజయవాడలో జరిగిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆంతరంగిక సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలపై కీలక చర్చించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాల్ని తీవ్రస్థాయిలో ఎండగట్టాలని, కలసి పోరాడాలని వారు నిర్ణయించారు.

ప్రజాసమస్యలపై పోరాటంలో తమతో కలసి పనిచేసేందుకు ముందుకు వచ్చే పార్టీల మద్దతూ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలనే కోణంలో జరిగిన ప్రయత్నానికి ఆ సందర్భం నాంది అనే చెప్పాలి.

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్ని తమవైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేశారు. జగన్ 99శాతం అమలు చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెప్పగలిగారు. జగన్ పది రూపాయలిచ్చి వంద రూపాయలు తిరిగి పన్నులు, ఇతరత్రా ధరల పెంపు రూపేణా దోచుకుంటున్నాడని వివరిస్తూనే, తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి ద్వారా ఆదాయం పెంచుకుంటూ రెట్టింపు సంక్షేమం ఇస్తామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో చంద్రబాబు సఫలమయ్యారు. ఐదేళ్ల అరాచక పాలనలో విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు, దెబ్బతిన్న వర్గాలకు భరోసానిచ్చేందుకు కూటమి మేనిఫెస్టోలో విస్తృత కసరత్తు చేశారు.

బీసీ వర్గాలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు, యువత ఉపాధికి, అభ్యున్నతికి విశేష ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల మధ్యా సమతూకం పాటిస్తూ, భవిష్యత్‌కు భరోసానిస్తూ, సముచిత అవకాశాలు కల్పిస్తామన్న నమ్మకం కలిగించారు.

చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో కేసులు పెట్టి వేధించడంతో పాటు అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టి నిర్భందించింది. బెయిల్ పై విడుదల అయ్యక మళ్లీ రోడ్డెక్కిన చంద్రబాబు, మునుపటి కంటే గట్టిగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించారు. గత ఏడాది జనవరి 5 నుంచి రా కదలి రా పేరుతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు భారీ సభలు నిర్వహించారు. మిని మేనిఫేస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. మార్చి 27 నుంచి ప్రజాగళం పేరుతో విస్తృత పర్యటనలు శ్రీకారం చుట్టారు. ప్రత్యర్థి పార్టీ ప్రచారం కనీసం ఈ దారి దాపుల్లో లేకుండా చంద్రయాన్ లా చంద్రబాబు దూసుకుపోయారు.

2023.. ఎత్తులు, పైఎత్తులు.. వ్యూహాలు, ప్రతివ్యూహాలు లాంటి సమీకరణాల జోరులో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా గత ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర... 226రోజులు, 3132 కి.మీ.ల మేర అవిశ్రాంతంగా కొనసాగి విశాఖజిల్లా అగనంపూడి వద్ద డిసెంబర్ లో దిగ్విజయంగా పూర్తయింది. ఈ సుదీర్ఘమైన మజిలీ 11 ఉమ్మడి జిల్లాల్లోని 97అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది.

పాదయాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని 3ప్రాంతాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. ప్రజలు నేరుగా ఓటింగ్ లో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, తెలుగుదేశంపై సానుకూలత స్పష్టంగా కనిపించాయి. 5ఏళ్ల ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఒక్క ఎమ్మెల్సీ దక్కటం కూడా కష్టమే అని భావించిన తరుణంలో 3పట్టభద్రుల ఎమ్మెల్సీలను, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ వేదికగా టీడీపీ, జనసేన ఎన్నికల శంఖారావం పూరించాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ టీడీపీ, జనసేన నాయకుల ఐక్యతకు, సమన్వయానికి అద్దంపట్టింది. విజయనగరం జిల్లాలోని పోలిపల్లి పోలికేక పెట్టింది. యువగళం-నవశకం సభకు పసుపు దండు, జనసైనికులు చేయి కలిపి కదం తొక్కారు.

ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result

ABOUT THE AUTHOR

...view details