Chandrababu Challeng to Jagan : మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న జగన్ గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్ష రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అని మండిపడ్డారు. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకమని ధ్వజమెత్తారు. విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకం అని దుయ్యబట్టారు. జగన్ మోసాలపై లోకేశ్ విడుదల చేసిన వీడియోను చంద్రబాబు రీట్వీట్ చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రతి పక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ లోకేశ్ చేసిన ట్వీట్‌ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. జగన్ ఇష్టారాజ్యంగా ఇచ్చిన హామీలు విస్మరించారని లోకేశ్ ట్వీట్లో గుర్తు చేశారు. అందులో కొన్ని ఇవి..
బడుగులను గుమ్మం బయటే నుంచో బెట్టడమేనా జగన్ చేసే సామాజిక న్యాయం: నారా లోకేశ్
ఇంతకీ జగన్ ఇచ్చిన హామీలేమిటంటే!ప్రతీ రైతన్నకు బోర్లు వేయిస్తామని, రైతులకు అండగా 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతినకుండా, గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచేలా శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తానని తెలిపాడు. రూ.4వేల కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సాగు నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పరుగులు తీయిస్తానని నమ్మబలికారు. కౌలుదారీ చట్టాన్ని ప్రక్షాళన చేయిస్తానని, ప్రతి మండల కేంద్రంలోనూ వృద్ధాప్య ఆశ్రమం ఏర్పాటు చేసి డాక్టర్లు, నర్సుల నియామకం పూర్తి చేస్తామని హామీఇచ్చారు. కియా పరిశ్రమను వెనక్కి పంపిస్తామని, పోలవరం నిర్వాసితులకు ఎకరాకు 19 లక్షలు రూపాయలు చెల్లిస్తామని అన్నారు. విశాఖ పరిధిలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, పెట్రోల్, డీజిల్ బిల్లులు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తగ్గిస్తామని చెప్పారు. బీసీలకు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, రాజధానిని వాషింగ్టన్ డీసీలా కట్టిస్తామని జగన్ ప్రగల్భాలు పలికారు.
'జగన్ హ్యాండ్సప్, వైసీపీ ప్యాకప్' - వైరల్ అవుతున్న నారా లోకేశ్ ట్వీట్