Telangana MLC Kavitha Reacts on Adani Case :సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం కోసం 5 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసుపై తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఆడబిడ్డకో న్యాయం అదానీకో న్యాయమా ? అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా, ఆడబిడ్డను అరెస్టు చేయడం నరేంద్ర మోదీ సర్కార్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండవని అన్నారు. అదే ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా అని ప్రశ్నించారు.
MLC Kavitha Fire on Modi Over Adani Case :ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా, అదానీ వైపే ప్రధాని ఉంటారా అని కవిత తెలుగు, ఇంగ్లీష్‌లో చేసిన ట్వీట్లలో పీఎం నరేంద్ర మోదీని ప్రశ్నించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయడంతో తిహాడ్ జైలులో ఉన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 164 రోజుల తరువాత బయటకు వచ్చారు. కవిత హైదరాబాద్ వచ్చిన తరువాత ప్రస్తుత పరిణామాలపై స్పందించడం ఇదే తొలిసారి.
అదానీ లంచం కేసు - వైఎస్సార్సీపీ సర్కార్‌కు భారీగా ముడుపులు
అమెరికాలో అదానీ సహా ఏడుగురిపై కేసు :అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై నమోదైన కేసుతో స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు కుప్పకూలాయి. ఆయన కంపెనీల షేర్లు పది నుంచి 22 శాతం వరకు నష్టపోయాయి. సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదానీ గ్రూప్ రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకున్న వారిలో అప్పటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా రూ.1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.
2019-24 మధ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు రూ.1750 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకు రూ.279 కోట్లు లంచం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్‌తో భేటీ అయ్యారు. జగన్‌తో అదానీ భేటీ తర్వాత డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు ఉన్నాయి.
జగన్ మెడకు అదానీ స్కామ్ - చేతులు మారిన రూ.1750 కోట్లు - అమెరికా కోర్టు ఆరోపణ
అమెరికా ఆరోపణల ఎఫెక్ట్- భారీ నష్టాల్లో అదానీ కంపెనీల స్టాక్స్- రూ.2.45 లక్షల కోట్లు ఆవిరి