RTC Bus Accident in Vijayawada: కృష్ణాజిల్లాలో వరుసగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరిగాయి. విజయవాడ ప్రసాదంపాడులో ఆర్టీసీ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావటంతో పార్కింగ్‌లో వాహనాలు ఢీకొడుతూ కార్ల షోరూమ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పటమట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
మరోవైపు పమిడిముక్కల మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మంటాడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుండి దట్టంగా పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతో బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించి వారి ప్రాంతాలకు తరలించారు. ఈ బస్సు కాలేశ్వరరావు మార్కెట్ నుండి గుడ్లవల్లేరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంజిన్ వైరింగ్ షార్టేజ్ కారణంగానే పొగలు వచ్చాయని, వెంటనే అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పిందని డ్రైవర్ వెల్లడించారు.
అన్నకి బాయ్ చెప్పడానికి వచ్చి అనంత లోకాలకు - స్కూల్ బస్సు కింద నలిగిన చిన్నారి