BLACK GOLD CAMPHOR TREE : దేవుడి పూజల్లో పసుపు, కుంకుమ, కొబ్బరికాయకు ఎంత ప్రాధాన్యం ఉందో.. దాదాపు అంతే స్థాయిలో కర్పూరం కూడా ప్రధానమైన ద్రవ్యమే. ఆలయాల్లోనూ వేద పండితులు మూలవిరాట్టుకు కర్పూర హారతి ఇచ్చి భక్తులకు అందిస్తారు. పంచహారతుల్లో దూతి వత్తుల కొనలకు కర్పూరం బిళ్లలు నలిపి అంటిస్తే వెంటనే అంటుకుంటాయి. కేవలం పూజల్లోనే కాదు.. ఆరోగ్య పరంగానూ కర్పూరం ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. జలుబు, శ్వాసకోశ సమస్యల నుంచి సత్వర ఉపశమనం కల్పించడంలో కర్పూరం ఎంతో చక్కగా పనిచేస్తుంది. అంతటి విశేషమైన కర్పూరం ఎలా తయారవుతుందో 99శాతం మందికి తెలియదు. అది ప్రకృతి ప్రసాదితమా లేక రసాయనాల సమ్మేళనమా అనేది చాలా మంది ఆలోచించి ఉండరు.
కర్పూరం తయారీ ఇలా..
మార్కెట్‌లో రెండు రకాల కర్పూరం అందుబాటులో ఉంది. సహజ సిద్ధంగా తయారు చేసిన కర్పూరంతో పాటు ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారు చేసిన కర్పూరం మరొకటి. సహజ కర్పూరం మొక్క నుంచి తయారవుతుంది. కర్పూరం చెట్టు శాస్త్రీయ నామం Cinnamomum Camphoraగా పిలుస్తారు. కర్పూరం చెట్టు 50 నుంచి 60 అడుగుల దాకా పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు గుండ్రంగా, 4 అంగుళాల వెడల్పు ఉంటాయి. అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రచురించిన Camphor is a naturally occurring terpene found in trees in the laurel family (Lauraceae), notably camphor laurel, or Cinnamomum camphora జర్నల్‌లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ చెట్టు బెరడు నుంచే కర్పూరం తయారవుతుంది. బెరడును ఎండబెట్టడంతో పాటు సహజసిద్ధంగా బూడిద రంగులోకి మారినపుడు కర్పూరం తయారు చేస్తారు. ప్రాసెసింగ్ చేసి పొడిగా మార్చి కావల్సిన రూపాల్లో అచ్చులు పోస్తారు.
శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్ - ఇరుముడికట్టులో ఆ వస్తువులు తేవొద్దని బోర్డు విజ్ఞప్తి
కర్పూరం చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే!
కర్పూరం చెట్లు మొట్టమొదటగా తూర్పు ఆసియా (East Asia)లో, ప్రత్యేకంగా చైనాలో కనుగొన్నట్లు తెలుస్తోంది. కానీ, కొంతమంది వృక్షశాస్త్రజ్ఞులు దీనిని జపాన్ దేశానికి చెందినదిగా పేర్కొంటున్నారు. కర్పూరం చెట్ల నుంచి తయారు చేసిన ఐస్ క్రీం టాంగ్ రాజవంశం కాలంలో ప్రాచుర్యం పొందింది. చైనీయులు దీనిని ఔషధాల తయారీలోనూ కర్పూరం ఉపయోగించగా క్రమంగా అది ప్రపంచమంతటా వ్యాపించింది.
మన దేశంలోకి ఎప్పుడు వచ్చిందంటే?
కోల్‌కతాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ ఆర్.ఎన్.చోప్రా, బి.ముఖర్జీ 1882-83 సమయంలో లక్నోలోని ఉద్యానవనంలో కర్పూరం చెట్లను విజయవంతంగా పెంచారని 1932లో ఓ పత్రికలో ప్రచురితమైంది. ప్రారంభంలో వారి ప్రయత్నాలు విఫలమైనా తిరిగి కొన్నేళ్లలోనే సత్ఫలితాలిచ్చినట్లు సమాచారం.
కర్పూరం చెట్టును నల్ల బంగారం అని ఎందుకు అంటారు?
ఎర్ర చందనమే కాదు ప్రపంచంలోని అత్యంత విలువైన చెట్లలో కర్పూరం కూడా చోటు దక్కించుకుంది. కర్పూరం చెట్టులో అరుదైన రసాయనాలున్నాయి. అందుకే దీనిని నల్ల బంగారం (Black Gold) అని కూడా అంటారు. పూజలో ఉపయోగించే కర్పూరం మాత్రమే కాకుండా ఎసెన్షియల్ ఆయిల్స్‌తో పాటు వివిధ రకాల మందులు, పెర్ఫ్యూమ్‌లు, సబ్బులు కూడా తయారు చేస్తారు. కర్పూరం చెట్టులో కీమోటైప్స్ అనే రసాయనాలు కూడా ఉన్నాయని వృక్ష శాస్త్ర పరిశోధకులు నిర్ధారించారు. కర్పూరం, లినాలూల్, సినోల్, నెరోలిడోల్, సఫ్రోల్తో పాటు బోర్నియోల్ అనే ఆరు రకాల రసాయనాలు ఉన్నందునే దీనిని నల్ల బంగారం అంటారు.
కర్పూరం వెంటనే ఎందుకు మండుతుంది?
కర్పూరం అస్థిర పదార్థం కావడంతో వేడిచేసినప్పుడు ఆవిరిగా మారుతుంది. గాలిలో వేగంగా వ్యాపించడంతో పాటు ఆక్సిజన్‌తో కలిసిన వెంటనే మండుతుంది. కర్పూరంలో కార్బన్, హైడ్రోజన్ అధిక మొత్తంలో ఉన్నందున దహన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం వల్లే కొంచెం వేడి తగలగానే మండుతుంది.
కర్పూరం పరిశ్రమలో గ్యాస్ లీక్ - ఐదుగురు కూలీలకు అస్వస్థత
ఇంట్లో వాస్తు దోషంతో ఇబ్బందులా? - కర్పూరంతో ఇలా చెక్ పెట్టండి!