తెలంగాణ

telangana

ETV Bharat / politics

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసు - వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ - amit shah video morphing case - AMIT SHAH VIDEO MORPHING CASE

Amit shah Video Morphing Case : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసు కావడం, దిల్లీలో హోం శాఖ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఇక్కడ హైదరాబాద్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి ఫిర్యాదుతో కేసులు నమోదు కావడం కీలకంగా మారాయి. కేసులు నమోదు చేయడం కూడా జాతీయ కాంగ్రెస్‌ పార్టీపై కావడంతో దిల్లీ పోలీసులు సైతం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Amit shah Video Morphing Case update
Amit shah Video Morphing Case (ఈటీవీ భారత్ ప్రత్యేకం)

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 7:38 PM IST

Congress on Amit shah Video Morphing Case : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వీడియోలను మార్ఫింగ్‌ చేసి బీజేపీపై దుష్ప్రచారం చేసినట్లు నాలుగు రోజుల కిందట అటు దిల్లీలో, ఇటు తెలంగాణలో రెండుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయనున్నట్లు అమిత్‌ షా మాట్లాడినట్లు కాంగ్రెస్‌ నాయకులు మార్ఫింగ్‌ చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో అటు దిల్లీలో గత నెల 28న, ఇటు హైదరాబాద్‌లో గత నెల 27న 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 469, 505 కింద కేసులు నమోదు చేశారు. అక్కడ దిల్లీలోని ప్రత్యేక విభాగం ఐటీ చట్టం సెక్షన్‌ 66(సి) కింద కేసు నమోదు చేసిన సెక్షన్లు 153, 153 ఎ, 465, 469 రెడ్‌ విత్‌ 171 ఈ కేసు నమోదు చేసింది.

అయితే దిల్లీ పోలీసులు హైదరాబాద్‌ వచ్చి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్ సామాజిక మీడియా ఛైర్మన్‌ మన్నె సతీశ్, నవీన్‌, శివకుమార్‌, తస్లీమ్​లకు నోటీసులు ఇచ్చారు. మే 1న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై అధ్యయనం చేసిన కాంగ్రెస్‌ లీగల్ సెల్‌ ఇంఛార్జీ రామచంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం దిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్టార్‌ క్యాంపెయినర్‌ అయినందున రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాల్సి ఉందని వివరణ ఇచ్చారు. దీంతో ఈ నెల ఒకటో తేదీన రేవంత్‌ రెడ్డి విచారణకు హాజరు కాలేరని స్పష్టం చేసిన రాష్ట్ర కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇంఛార్జీ రామచంద్రారెడ్డి, కనీసం 4 వారాల గడువు కావాలని దిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - సీఎంకు నాలుగు వారాలు గడువు కోరిన పీసీసీ లీగల్​ సెల్​ - Amit Shah Fake Video Case

అదేవిధంగా మన్నె సతీశ్, మరో ముగ్గురి విషయంలోనూ నోటీసులో పేర్కొన్న సాంకేతికపరమైన అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నందున కనీసం రెండు వారాలైనా గడువు కావాలని దిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగానే ఇవాళ మధ్యాహ్నం దిల్లీకి చెందిన సీఐ రామ్‌ నివాస్‌, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు మరోసారి గాంధీభవన్‌ వచ్చారు. మరికొన్ని నోటీసులు ఇచ్చేవి ఉన్నట్లు తెలిపారు. లీగల్‌ సెల్‌ ఇంఛార్జీ రామచంద్రారెడ్డి అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. అక్కడే ఉన్న ఇంటెలిజెన్స్‌ అధికారులు విషయాన్ని స్థానిక బేగంబజార్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బేగంబజార్‌ పోలీసులు గాంధీభవన్ వచ్చారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అప్పటికే దిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - మరోసారి గాంధీభవన్​కు దిల్లీ పోలీసులు - Amit Shah Fake Video Case

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులను సైబర్‌ స్టేషన్‌కు నేడు పిలిపించారు. నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సమయం కోరినా, కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో ఉన్న దిల్లీ పోలీసులు చొరవ తీసుకొని ముందుకు వెళ్తారన్న భావనలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీ పోలీసులు మరింత ముందుకెళ్లే అవకాశం ఉందని అంచనా వేసిన రాష్ట్ర కాంగ్రెస్‌, నోటీసులపై న్యాయ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీ కంటే ముందు రోజే హైదరాబాద్‌ సీసీఎల్​లో కేసు నమోదైనందున దిల్లీకే బదిలీ చేయమని పోలీసులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు లీగల్‌ సెల్‌ విభాగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు - భయపడేది లేదన్న సీఎం రేవంత్​

ABOUT THE AUTHOR

...view details