Telangana Cabinet Meeting Today :లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇవాళ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం(Minister Ponnam Prabhakar), శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం సహా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై సర్కారు విచారణకు సిద్ధమైంది.
కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ :ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ కమిటీ వేసిన కేబినెట్, 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచించింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై(Yadadri Power Project) విచారణకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.
ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలి - హైకోర్టులో దస్తగిరి పిటిషన్
"విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయి విచారణ కోసం నియమించాం. ఈమేరకు 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన చేశాం. అదేవిధంగా భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డిని ఛైర్మన్‌గా నియమించాం. దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఏదైతే ఆనాడు ఛత్తీస్‌గఢ్‌లో 1000 మెగా వాట్ల పవర్‌ను నామినేట్ సిస్టమ్‌తో కొని, దళారులకు ధారాదత్తం చేశారో దానిపై విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం."-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి
Minister Ponguleti Disclosure of Cabinet Points :ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోళ్ల అంశంపైనా విచారణకు కేబినెట్ నిర్ణయించింది. అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రివర్గం, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి(Indiramma House Scheme) ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాలవారీగా 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు(DSC Qualified Candidates) ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం, మినిమం టైం స్కేల్‌తో 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్ - షరతులు వర్తింపు