TDP Leaders Allegations on YCP Govt Irregularities:ఐఎంజీపై సజ్జల, ఇతర వైసీపీ నాయకులు చేస్తున్న అర్థరహిత ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) విమర్శించారు. 2006లోనే రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలవాయి గోవర్థన్ రెడ్డి ఐఎంజీ భారత భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం క్రీడల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఐఎంజీకి చేసిన భూ కేటాయింపులు పూర్తి పారదర్శకమని ఏసీబీ కోర్టు, హైకోర్టు రెండూ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. ఎప్పటికైనా భారతదేశంలో ఒలంపిక్స్ గేమ్స్ జరగాలన్నది చంద్రబాబు విజన్ అని దానికి తగ్గట్టు ఆనాటి హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి క్రీడా సదుపాయాలతో సిద్ధంగా ఉండాలన్నది ఆయన లక్ష్యమని వివరించారు.
జగన్ హామీలన్నీ శుద్ధ అబద్ధం- తీవ్రంగా నష్టపోయిన ఉద్యాన రైతాంగం
Former Minister Alapati Rajendra Prasad:జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మేనిఫెస్టో విడుదల చేసే ముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేశారో తెలపాలని సవాల్ విసిరారు. 17 శాతం కన్నా ఎక్కువ హామీలు అమలు చేసివుంటే మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో నిరూపించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రైతాంగం నడ్డివిరిచిందని మండిపడ్డారు.