ETV Bharat / state

అలర్ట్ - ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు - రోగుల్లో వారే అత్యధికం - CANCER CASES INCREASING IN AP

రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్‌ రోగులు - రొమ్ము, గర్భాశయ బాధితులు ఎక్కువ

Cancer Cases Increasing in AP
Cancer Cases Increasing in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 8:30 AM IST

Cancer Cases Rising in AP : ఏపీలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆరోగ్యశ్రీలో చికిత్సలు పొందే వారే 15 సంవత్సరాల్లో 70 శాతం పెరిగారు. 2009-2010లో 27,097 మంది ఉన్నారు. 2024-25లో (నవంబర్ వరకు) 46,223 మంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఏటా సగటున 45,000ల నుంచి 50,000ల క్యాన్సర్‌ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. క్యాన్సర్‌ బాధితుల్లో మహిళలే ఎక్కువ. 2009-2010లో 67,218 కేసులు నమోదయ్యాయి. 2024-2025లో (నవంబర్ వరకు) 2,22,605 వచ్చాయి. ఇది 231 శాతం ఎక్కువ.

క్యాన్సర్‌ రోగులకు దశలవారీగా చికిత్స అవసరం కావడంతో ఒక్కొక్కరు సంవత్సరానికి నాలుగైదు సార్లు చికిత్సకు వస్తున్నారు. ఈ క్రమంలో బాధితుల సంఖ్య కంటే ఆరోగ్యశ్రీ ట్రస్టులో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 2014-2015 నుంచి పరిశీలిస్తే పదేళ్లలో బాధితుల సంఖ్య 8 శాతం, కేసుల సంఖ్య 179 శాతం చొప్పున పెరిగింది.

మహిళలు 28,725, పురుషులు 17,498 మంది : ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 2024-2025 నవంబర్​లో 28,725 మంది మహిళలు చికిత్స పొందగా పురుషులు 17,498 మంది ఉన్నారు. బాధిత మహిళల్లో 27 శాతం మంది రొమ్ము, 24 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు అంచనా. ఆ తర్వాత అండాశయం, తల, మెడ (నోరు, గొంతు, థైరాయిడ్‌ తదితర), ఉదరం (పొట్ట, పెద్దపేగు, చిన్నపేగు) క్యాన్సర్‌ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు.

పురుషులకు ఎక్కువగా తల, మెడ (నోరు, గొంతు, థైరాయిడ్, ఇతర), ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, పొట్ట (చిన్నపేగు, ఇతర), పురుషాంగం, పెద్దపేగు క్యాన్సర్లు వస్తున్నాయి. మెడికల్‌ ఆంకాలజీ, కీమో, రేడియోథెరపీ లాంటి చికిత్సలు ఎక్కువగా పొందుతున్నారు. కొందరికి రెండుసార్లు శస్త్రచికిత్సలు అవసరమవుతున్నాయి.

Cancer Cases Increasing in AP
ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నమోదైన కేసులు - చికిత్స వ్యయం పట్టిక (ETV Bharat)

2007-2008 నుంచి రూ.4,500 కోట్ల వ్యయం : ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆవిర్భావం (2007-08)నుంచి ఇప్పటివరకు క్యాన్సర్‌ చికిత్సల కోసం రూ.4500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. 2024-2025లో నవంబర్ వరకు ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆరోగ్యశ్రీ ట్రస్టు క్యాన్సర్‌ చికిత్సపై రూ.600 కోట్ల వరకు వెచ్చించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి రానివారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందుకోసం కొందరు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు వెళుతున్నారు. వీరిసంఖ్య మరో 50,000ల వరకు ఉంటుందని అంచనా.

Cancer Cases Increasing in AP
ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారి సంఖ్య (ETV Bharat)

విజృంభిస్తున్న 'మహమ్మారి' - మీలో ఈ లక్షణాలు ఉన్నాయా - జాగ్రత్త పడండి

దేశంలో తొలి రాష్ట్రంగా ఏపీ - 34 వేల 653 మందిలో క్యాన్సర్‌ లక్షణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.