ETV Bharat / state

శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం - ఇద్దరు మృతి - 108 ACCIDENT IN TIRUPATI DISTRICT

తిరుపతి జిల్లాలో 108 వాహనం బీభత్సం - ఇద్దరు మృతి, మరో ముగ్గురికి గాయాలు

108 Vehicle Moved into Walking Devotees Of in Tirupati District
108 Vehicle Moved into Walking Devotees Of in Tirupati District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 8:28 AM IST

108 Vehicle Moved into Walking Devotees Of in Tirupati District : తిరుపతి జిల్లాలో 108 వాహనం బీభత్సం సృష్టించింది. నడిచివెళ్తున్న శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే, పుంగనూరు నుంచి తిరుమలకు కొంతమంది భక్తులు కాలినడకన వెళ్తున్నారు. వారు చంద్రగిరి మండలం నరసింగాపురం వద్దకు వచ్చే సరికి వారిపైకి అంబులెన్స్ దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలవ్వడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మదనపల్లె నుంచి ఓ రోగిని అంబులెన్స్​లో తిరుపతి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు లక్ష్మమ్మ(45), పెద్ద రెడ్డమ్మ(40) పోలీసులు గుర్తించారు. వీరు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లి వాసులుగా తెలిపారు.

తల్లిదండ్రుల కోసం పిల్లల ఎదురుచూపు - అంతలోనే విషాదం

‘అమ్మానాన్న వస్తారు కొత్త బట్టలు తెస్తారు’ - ఇంటికెళ్లిన చిన్నారులకు షాక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.