Changes in Police Constable Physical Fitness Tests in Some Districts : రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు. వైకుంట ఏకాదశి, శాంతి భద్రతల సమస్యల కారణంగా ఈనెల 8 నుంచి 10 వరకు జరగనున్న దేహదారుఢ్య పరీక్షలు (PMT,PET) భర్తీ ప్రక్రియను కొన్ని జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈనెల 8న జరగాల్సిన దేహధారుడ్య పరీక్షలను 11వ తేదీకి మార్చినట్లు తెలిపారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈనెల 17, 18, 20వ తేదీల్లో హాజరుకావచ్చని అభ్యర్థులకు సూచించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 30 న ప్రారంభమైన పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఫిబ్రవరి ఒకటి వరకు కొనసాగుతాయి.
నిరుద్యోగులకు అలర్ట్ : జనవరి 12న జాబ్ క్యాలెండర్ విడుదల, ఒకేసారి 18 నోటిఫికేషన్లు!
రైల్వే మెగా ఎగ్జామ్ - 18,799 ALP పోస్టుల భర్తీ కోసం - 22.5 లక్షల మంది అభ్యర్థులకు స్క్రీనింగ్