TDP Leaders Allegations on CM Jagan:బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు హైదరాబాద్ పాట పాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆరోపించారు. విశాఖలో జగన్ రెడ్డి 40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడని అందుకే ఇప్పటి వరకు విశాఖే రాజధాని అన్నాడని మండిపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. గతంలో అమరావతిలో 30 వేల ఎకరాలున్నాయని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని అన్నారు కానీ ఇప్పుడు కొత్త నాటకం మొదలెట్టారని విమర్శించారు. జగన్ అమరావతిని పూర్తి చేస్తానంటూ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చాక నాశనం చేశాడని మండిపడ్డారు.
నీ రాక - మాకో శాపం స్వామీ! 'ఆడుదాం ఆంధ్రా' ముగింపుతో జనం ఉక్కిరిబిక్కిరి
కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు హైకోర్టు బెంచి రాకుండా చేశాడని మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శించారు. జగన్ మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నాడని ఇప్పుడు హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తీసుకొచ్చాడని విమర్శించారు. బినామీ ఆస్తుల కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని అచ్చెన్న దుయ్యబట్టారు. జగన్ రెడ్డి అరాచకాలు తెలియాలంటే రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్ధమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత అధికారంలోకి వస్తామని అమరావతిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతాని, రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.