Varma Challenged YSRCP Leaders on Kakinada SEZ:కాకినాడ ఎస్‌ఈజడ్‌పై బహిరంగ చర్చకు రావాలంటూ వైఎస్సార్సీపీ నేతలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కౌంటరుగా వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ ఎస్‌ఈజడ్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేతల్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. రైతులపై తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిందని విమర్శిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు కాకినాడ ఎస్‌ఈజడ్ పెట్టింది ఎవరో తెలుసుకోవాలని వర్మ అన్నారు.
జగన్ హయాంలోనే రైతులకు తీవ్ర అన్యాయం: సెజ్‌ను ఎవరు ప్రారంభించారు? ఎవరెవరు బినామీలు ఉన్నారనే విషయాలను సోమవారం 3 గంటలకు ఉప్పాడ సెంటర్లో నిర్వహించే బహిరంగ చర్చకు రావాలని వర్మ సవాలు విసిరారు. వైఎస్సార్సీపీ నేతలు బహిరంగ చర్చకు రాకపోతే అన్యాయం చేసింది మీరేనని అంగీకరించినట్టేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వ్యవహారాలపైనా విచారణ చేస్తుందని చెప్పారు.