TDP Leader Tirunagari Jyothsna on CM Jagan: వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరం జ్యోత్స్న అన్నారు. ఒక యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని విమర్శించారు. వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో సమావేశంలో కూర్చున్న జగన్ పరువు పోతుందని సజ్జల భార్గవ్ గూగుల్లో వెతుక్కోవాలని కవరింగ్ ఇచ్చారన్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్పై ఉన్న సీబీఐ, ఈడీల ఛార్జ్ షీట్ లిస్ట్, వేల కోట్లు దోచుకున్న వివరాలు బయటపడతాయన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడని ప్రశ్నించారు. జగన్కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసని మండిపడ్డారు.
జగన్ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు?: తిరునగరం జ్యోత్స్న - TDP Tirunagari Jyothsna on CM Jagan - TDP TIRUNAGARI JYOTHSNA ON CM JAGAN
TDP Leader Tirunagari Jyothsna on CM Jagan: వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ నేత తిరునగరం జ్యోత్స్న అన్నారు. ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడని ప్రశ్నించిన ఆమె జగన్కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసని మండిపడ్డారు.
![జగన్ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు?: తిరునగరం జ్యోత్స్న - TDP Tirunagari Jyothsna on CM Jagan TDP_Leader_Tirunagari_Jyothsna_on_CM_Jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-04-2024/1200-675-21304755-thumbnail-16x9-tdp-leader-tirunagari-jyothsna-on-cm-jagan.jpg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 6:18 PM IST
చెల్లమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన జగనన్న - YCP Social Media Activists
"వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారు. ఒక యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక జగన్ తెల్లముఖం వేశారు. వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో సమావేశంలో కూర్చున్న జగన్ పరువు పోతుందని సజ్జల భార్గవ్ గూగుల్లో వెతుక్కోవాలని కవరింగ్ ఇచ్చారు. గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్పై ఉన్న సీబీఐ, ఈడీల ఛార్జ్ షీట్ లిస్ట్, వేల కోట్లు దోచుకున్న వివరాలు బయటపడతాయి. సీఎం జగన్ లాంటి ఒక ఆర్థిక నేరస్థుడు ఏ విధంగా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు? జగన్కు ప్రజలను దోచుకోవటం, దోచుకున్న సొమ్ము దాచుకోవడమే తెలుసు." - తిరునగరం జ్యోత్స్న, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి