ఒకే వేదికపై మెరిసిన మూడు పార్టీల అధ్యక్షులు- వైసీపీ వైఫల్యాలపై ఎండగట్టిన నేతలు TDP Janasena BJP Prajagalam Public Meeting:జగన్ గొడ్డలి వేటుకు బలికానోళ్లు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా, ఎవరైనా బాగున్నారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలసి చంద్రబాబు పాల్గొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలపై మూడు పార్టీల అధ్యక్షులు నిప్పులు చెరిగారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని అన్ని వర్గాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఒకే వేదికపై మూడు పార్టీల అధ్యక్షులు:రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి తొలిసారి ఒకే వేదికపై మెరిసి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. సభకు భారీగా తరలివచ్చిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు అధినేతలకు హర్షధ్వానాలు పలికారు.
గెలుపు కోసం వైసీపీ కుయుక్తులు- ఓట్లు తమకే వేయించాలని తాయిలాల ఎర - YSRCP Distribute Gifts to MEPMA RPs
'మూడు పార్టీల త్యాగం రాష్ట్ర సంక్షేమం కోసమే':తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన సభకు తణుకు నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు, పవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దారిపొడవునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మూడు పార్టీల త్యాగం రాష్ట్ర సంక్షేమం కోసమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
'రౌడీరాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి':రాష్ట్రంలో అన్ని ధరలు, విద్యుత్ ఛార్జీలను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదిరించే వాళ్లు లేకపోతే బెదిరించే వాళ్లదే రాజ్యమని, బెదిరించే వాళ్లకు సమాధానం చెప్పేందుకు ఒక సముహం వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రౌడీరాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి. ధర్మం నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను అయిదుగురు గుప్పెట్లో పెట్టుకుని బెదిరిస్తున్నారని, ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.
'వైసీపీ వైపరీత్యంతో ఏపీ అన్ని విధాలా కుదేలైంది': వైఎస్ వివేకాను చంపిన హంతకులను వెనకేసుకొస్తున్నారని, వాళ్ల ఇంట్లో వాళ్లకే రక్షణ లేదని సొంత చెల్లెల్నే గోడకేసి కొట్టారని ఆరోపించారు. వైసీపీ వైపరీత్యంతో రాష్ట్రం అన్ని విధాలా కుదేలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీసీ కమిషన్‌కు కేంద్రం చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రంలో కల్పించకుండా వైసీపీ బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.
తిరుపతిలో మళ్లీ దొంగ ఓట్ల అలజడి- 38,493 నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించిన ప్రతిపక్షాలు - Mistakes in Tirupathi Voter List