Big Shock to Peddi Reddy :వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ఒంటిచేత్తో రాజకీయాలు నెరపిన పెద్దిరెడ్డి సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం అనూహ్య పరిణామాలు చవిచూస్తున్నారు.
PeddiReddy Political Career End? :ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం నియోజకవర్గంలో పర్యటించలేని స్థితికి పెద్దిరెడ్డి పరిస్థితి దిగజారిపోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని గడచిన ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్డీయే కూటమి నేతలకు అండగా ఉండటం పెద్దిరెడ్డికి ఇబ్బందిగా మారింది. పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించడానికి ప్రయత్నించిన రెండు సార్లు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పర్యటన విరమించుకున్నారు.
పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ - Shock to Ex Minister peddireddy
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓటమి నియోజకవర్గంలో తనకు ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కార్యకర్తలకు అండగా నిలవలేకపోతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో శ్రేణులకు పదవులు కట్టపెట్టి అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాలు చేసిన పెద్దిరెడ్డి పార్టీ ఓటమి పాలయ్యాక సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోవడం మరో వైపు పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితులతో వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు.