ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగనన్న సభ ఉంది జాగ్రత్త!- సిద్దం సభలతో జనం అవస్థలు - People in trouble in Jagan meetings - PEOPLE IN TROUBLE IN JAGAN MEETINGS

People in trouble in Jagan meetings : జగన్​ సభకు వచ్చే రోజువారీ కూలీలు గొంతెండుతుంటే ఏదైనా ప్రయాణం పెట్టుకున్నా వాళ్లు బస్సుల్లేక మండుటెండల్లో కాళ్లకు బుద్ది చెప్పాల్సిన పరిస్థితి. గతంలో జరిగిన ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలే కాదు, ప్రస్తుతం ఎన్నికల సభల ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్​ ఆంక్షలు విధిస్తుండడంతో మండుటెండల్లో అవస్థలు పడుతున్నారు. మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం కూడా తాగునీటికి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

cm_jagan_tour
cm_jagan_tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 7:50 PM IST

CM Jagan public meeting : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలను మూసివేయడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ ఏర్పాట్ల కోసం ఎర్త్ పైపు ఏర్పాటుకు రంధ్రం వేస్తుండగా భూమి లోపల ఉన్న మున్సిపాలిటీ పైపులైను పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా నీళ్లన్నీ సభా ప్రాంతంలో ప్రధాన రహదారిపై చేరాయి. అసలే వేసవికాలం ఇప్పటికే మున్సిపాలిటీ సిబ్బంది గ్రామంలో రోజు మార్చి రోజు తాగునీరు అందిస్తున్నారు. తీరా ఇప్పుడు పైపులైను మరమ్మతు కారణంగా మళ్లీ మంచినీటికి ఇబ్బందులు ఏర్పడతాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లు మోసం చేశారు - ఇప్పుడెలా వస్తున్నారు ? - సీఎం జగన్​ను ప్రశ్నిస్తున్న కాకినాడ ప్రజలు - Jagan Not Fulfil Promises to people

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అంబాజీపేటలో జరిగిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రసార సభ పేలవంగా సాగింది సభకు అనుకొన్న స్థాయిలో జనం రాకపోవడంతో ఉపాధి కూలీలను అక్కడికి తరలించారు. ఇదిలా ఉండగా సభకు వచ్చిన మహిళలు ఎండను తట్టుకోలేక విలవిల్లాడారు. పోలీసులు మితిమీరిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉదయం 10 గంటల నుంచే అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి మళ్లించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సీఎం బస్సు యాత్రతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అవస్థలు - CM Jagan Siddam BUS Yatra

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు లో సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహించారు. వెంకన్న పాలెం వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడిపించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చోడవరం, అల్లూరి జిల్లా, పాడేరు వెళ్లే ప్రయాణికులకు రవాణా మార్గం లేక అవస్థలు ఎదుర్కొన్నారు. విశాఖ నుంచి చోడవరానికి అంతంత మాత్రంగా ఆర్టీసీ సర్వీసులు నడిపారు. సూర్యుడు ఎర్రగా ప్రతాపం చూపిస్తున్న సమయంలో చిన్న పిల్లలతో ఐదు కిలోమీటర్లు నడుస్తూ చోడవరానికి వెళ్లారు.

మద్యం, బిర్యానీ ఇచ్చి జనం తరలింపు - అయినా సీఎం జగన్​ ప్రసంగిస్తుండగానే సభ ఖాళీ - NO Public in Jagan Meeting

సీఎం జగన్ అనకాపల్లి జిల్లా చోడవరం రావడం ఆలస్యం కావడంతో తరలించిన జనం ఎండకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మంచినీళ్ల ప్యాకెట్ల కోసం వెంపర్లాడారు. షెల్టర్​ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద కార్యకర్తలు గుమిగూడడంతో లోపలికి వెళ్లేందుకు ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. న్యాయస్థానంలోనూ పార్టీ జండాలతో వాహనాలు పెట్టారు. సీఎం రాకతో మెయిన్ రోడ్డు లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుకాణాలు మూసివేశారు.

జగన్ బస్సు యాత్ర కోసం విద్యుత్‌, ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం - CM Jagan Memu Siddam Bus Yatra

ABOUT THE AUTHOR

...view details