Rahul Gandhi Telangana Tour Schedule: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఓటర్ల దృష్టిని ఆకర్శించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. ప్రచారానికి అగ్రనేతలు రానుండటంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చి తమ పార్టీల తరుఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జనజాతర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మే 5న తెలంగాణకు రానున్నారు. నిర్మల్లోను, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లో జరిగే బహిరంగ సమావేశాలకు హాజరవ్వనున్నారు.
Rahul Gandhi Nirmal Meeting Arrangements :ఆదిలాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ సైతం ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ సభల్లో పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించగా తాజాగా ఆదివారం నిర్మల్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అయిదు గ్యారెంటీ పథకాలు, వచ్చే ఆగస్టు పంధ్రాగస్టు నాటికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా మహిళా అభ్యర్థిగా ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చిన అంశాలను ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తోంది.
రాయ్‌బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ- మరి అమేఠీ నుంచి ఎవరంటే? - Lok Sabha Elections 2024