Political Leaders Tweets on TDP BJP JanaSena Alliance :ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తులపై ఆయా పార్టీల అగ్రనేతల ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తులపై ఆయా పార్టీల అగ్రనేతల ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపాయి. మళ్లీ ఎన్టీఏలో చేరడం సంతోషంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిట్లు తెలిపారు. బీజేపీ, జనసేనతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురుచూస్తున్నారని ఈ కూటమి ప్రజాశ్రేయస్సుకు స్వర్ణయుగం తెస్తుందనే నమ్మకముందన్నారు. ఏపీ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకు ఉన్నట్లు వెల్లడించారు.
టీడీపీ,జనసేన, బీజేపీల మద్య పొత్తు పొడిచింది- ఏపీ ప్రజల కోసం పనిచేస్తామన్న బీజేపీ
ఎన్డీఏ బలమైన రాజకీయ వేదిక :టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతూ తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరాయన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోదీ దార్శనికత నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
అమిత్ షా ట్యీట్కు చంద్రబాబు రీ ట్వీట్ : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందన్న అమిత్ షా కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన అవకాశాలున్నాయని, రాష్ట్ర అభివృద్ధి అంతిమంగా మన దేశ వృద్ధికి దోహదపడుతుందని బాబు అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రధాని మోదీ నాయకత్వంలో మేము కొత్త శకానికి నాంది పలుకుతామని చంద్రబాబు రీ ట్వీట్ చేశారు.