తెలంగాణ

telangana

ETV Bharat / politics

లోక్​సభ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు - పార్టీలు మారుతున్న నేతలు - Political Heat In Ummadi Palamuru

Political Heat In Palamuru District : మొన్నటివరకి బీజేపీలో ఉన్నమాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. బీఎస్పీ నుంచి నాగర్‌కర్నూల్‌లో పోటీచేయాలనుకున్న ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవనున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరగా ఆయన కుమారుడు భరత్ ప్రసాద్‌ను ఎంపీ బరిలో నిలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జడ్పీ ఛైర్‌పర్సర్ స్వర్ణసుధాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంపార్టీలో చేరారు. వివిధ పార్టీలనుంచి టికె్‌ట్ ఆశించి భంగపడ్డ నేతలు, రాజకీయ భవిష్యత్‌ కోసం ఇతర పార్టీల్లో చేరుతున్నారు. రాజకీయ నేతల పార్టీల మార్పుతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి

Political Heat In Ummadi Palamuru District
Political Heat In Ummadi Palamuru District

By ETV Bharat Telangana Team

Published : Mar 20, 2024, 7:39 PM IST

లోక్​సభ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు - పార్టీలు మారుతున్న నేతలు

Political Heat In Palamuru District :లోక్​సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కీలక నేతలు ఉన్నపార్టీని వీడటం, ఇతర పార్టీల్లో చేరడం వేగంగా జరిగిపోతున్నాయి. మహబూబ్‌నగర్ లోక్​సభ నుంచి కాంగ్రెస్‌ చల్లా వంశీచంద్‌రెడ్డిని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ డీకే అరుణని అభ్యర్ధులుగా ప్రకటించాయి. బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన కుమారుడు మిథున్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. జితేందర్ రెడ్డికి ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదా ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించింది.

Jithender Reddy Party Change: బీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన జితేందర్‌రెడ్డికి గత పార్లమెంట్(Parliament) ఎన్నికల్లో అభ్యర్ధిత్వం దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. ఈసారి అక్కడ అభ్యర్ధిత్వం దక్కకపోవడంతో మరోసారి పార్టీ మారారు. సుదీర్ఘకాలంగా పాలమూరు జిల్లాలో కీలక నేతగా ఉండటంతో ఆయన బలాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్లుగా మలచుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. కీలకనేత చేరికతో బీజేపీని బలహీనం చేయాలని హస్తం పార్టీ ఆలోచిస్తోంది. బీజేపీ మాత్రం జితేందర్‌రెడ్డి పార్టీ వీడటాన్నితేలిగ్గా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాతో కమలం పార్టీ ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అనుచరగణంతో ముఖ్యమంత్రి(Chief Minister) రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అది బీఆర్ఎస్​కు ప్రతికూలం కానుంది. స్వర్ణ సుధాకర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ZP ఛైర్మన్‌గా ఉన్నారు.

Palamuru District Political Review : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) తరపున గెలిచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు బీజేపీలో చేరారు. అధిష్ఠానాన్ని ఒప్పించి కుమారుడు భరత్‌ప్రసాద్‌కి టికెట్ ఖరారు చేసుకున్నారు. రాములు పార్టీని వీడటంతో గులాబీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ ఎంపీ(Sitting MP) పార్టీ మారడంతో కొత్త అభ్యర్థి కోసం వెతుకుతున్న తరుణంలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు తెరపైకి వచ్చింది. బీఎస్పీ తరపునఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రవీణ్‌కుమార్ బీఎస్పీని వీడటం, బీఆర్ఎస్​లో చేరడం ఆ పార్టీ తరఫునే నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం చకాచకా జరిగిపోయింది.

అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ :అభ్యర్ధి ప్రకటనపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగింది. సుమారు 26మంది అభ్యర్ధులు పోటీపడటంతో హస్తం పార్టీ ఎటూ తేల్చలేదు. చివరకు మంగళవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లు రవి అభ్యర్ధిత్వంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావటంతో రానున్న రోజుల్లో వలసలు పెరిగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల్లోంచి చేరేందుకు కీలక నేతలు ఆసక్తి చూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మరిన్ని వలసలు కొనసాగే అవకాశం ఉంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ - విజయం వరించేదెవరినో​?

ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి పాలమూరు రాజకీయాలు.. అలంపూర్​లో బీఆర్​ఎస్​ ప్లాన్​ ఏంటి..?

'ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. ఏ దందాలో చూసినా బీఆర్​ఎస్​ నేతలే'

ABOUT THE AUTHOR

...view details