తెలంగాణ

telangana

దుబాయ్​కు పారిపోయేందుకు దేవినేని అవినాశ్ ​ప్లాన్ - అడ్డు చెప్పిన శంషాబాద్​ ఎయిర్​పోర్టు పోలీసులు - Police Stop to D Avinash in airport

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 12:49 PM IST

Updated : Aug 16, 2024, 2:25 PM IST

Airport Authorities Stop to Devineni Avinash: వైసీపీ నేత దేవినేని అవినాశ్​కు శంషాబాద్ విమానాశ్రయంలో చుక్కెదురైంది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా మంగళగిరి పోలీసులకు ఎయిర్​పోర్టు అధికారులు సమాచారమిచ్చారు. అవినాశ్​పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ఎయిర్​పోర్టు నుంచి వెనుదిరిగారు.

Airport Authorities Stop to Devineni Avinash
Airport Authorities Stop to Devineni Avinash (ETV Bharat)

Airport Police Stop to YSRCP Leader Devineni Avinash : విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్​కు చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు. అవినాశ్​పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో అధికారులు ఆయనకు అడ్డు చెప్పడంతో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయ దాడిలో పాల్గొన్న వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేస్తూ విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారు.

కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నం :గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్​లో దేవినేని అవినాష్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఉన్నాయి. దాడి కేసులోని వైఎస్సార్సీపీ నేతలు విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కేసులో అవినాష్​ను ముందస్తు అరెస్టు చేయకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసుకు సంబంధించిన వాదనలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దుబాయ్​కి పారి పోయేందుకు ఆయన యత్నించారు. దీంతో శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న అవినాష్​ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. దేవినేని అవినాష్​పై ఎఫ్ఐఆర్ ఉందని అతనిని అడ్డుకోవాలని మంగళగిరి పోలీసులు విమానాశ్రయ అధికారులకు చెప్పడంతో దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు.

Devineni Avinash Plan to Run Away to Dubai : ఇంక చేసేదేమీ లేక అవినాష్​ అక్కడి నుంచి వెను తిరిగారు. ఈ దాడిలో అవినాష్‌తోపాటు పలువురు కీలక పాత్ర పోషించారని సీనియర్‌ బుధవారం హైకోర్టులో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు. ఎవరి ప్రోద్భలంతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే విషయాన్ని తేల్చాల్సి ఉందన్నారు.

ఇప్పటికే ఈ కేసులో 117 మందిని నిందితులుగా చేర్చామన్నారు. ఈ దాడి ఘటన కేసులో దర్యాప్తును ఉద్దేశపూర్వంగా నీరుగార్చిన ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశామన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. పోలీసుల తరఫు వాదనలు ముగియడంతో పిటిషనర్ల తరఫున కొందరు న్యాయవాదులు ప్రతి వాదనలు వినిపించడం కోసం విచారణ ఈనెల 21కి వాయిదా వేశారు.

వల్లభనేని కోసం పోలీసు బృందాల గాలింపు - పలువురు వంశీ అనుచరుల అరెస్ట్ - POLICE FOCUS ON VALLABHANENI VAMSI

హత్యలు, అరాచకాలు, వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్​ పిన్నెల్లి'పై టీడీపీ బుక్​ - TDP BOOK ON YCP MLA PINNELLI

Last Updated : Aug 16, 2024, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details